Airtel Voice Only Plan: ఇటీవల ట్రయ్ (TRAI) ఆదేశాల మేరకు కొన్ని టెలికాం కంపెనీలు వాయిస్ ఓన్లీ ప్లాన్స్‌ను పరిచయం చేశాయి. ఈ నేపథ్యంలో భారతీయ ఎయిర్‌టెల్ కూడా తమ కొత్త ప్లాన్లను సవరణ చేసింది. ఇందులో వాయిస్ కాలింగ్‌తో పాటు ఉచితంగా ఎస్ఎంఎస్‌లు కూడా పొందుతారు. ఎయిర్‌టెల్ అందిస్తున్న 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) గైడ్ లైన్స్ ప్రకారం కొన్ని టెలికాం కంపెనీలు వాయిస్ ఓన్లీ ప్లాన్స్ పరిచయం చేశాయి. వీటిలో టారిఫ్ కూడా తక్కువగా ఉంటుంది. ఎయిర్‌టెల్ కూడా కొత్త ప్లాన్ సవరణ చేసింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ రూ. 469 ప్రీపెయిడ్ ప్లాన్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
దీంతో డేటా వినియోగించలేని కస్టమర్‌లకు తక్కువ ధరలోనే వాయిస్ కాల్స్ అందుబాటులో ఉండాయి. దీంతో పాటు ఎస్ఎంఎస్ లు కూడా ఉచితంగా పొందుతారు.. రూ. 469 తో రీఛార్జ్ చేసుకుంటే 900 ఎస్ఎంఎస్ లో ఉచితం.. దీని వ్యాలిడిటీ 84 రోజుల పాటు వర్తిస్తుంది. ఫీచర్ ఫోన్ ఉపయోగించే వారికి అధిక ఖర్చు లేకుండా ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు.
అంతేకాకుండా మూడు నెలల పాటు అపోలో 24/7 సర్కిల్ మెంబర్షిప్ తో పాటు ఉచితంగా హలో ట్యూన్స్ కూడా పొందుతారు.. గతంలో ఈ ప్లాన్ ధర రూ. 499 రూపాయలు ఉండే అయితే ట్రయ్ ఆదేశాల మేరకు దీన్ని సవరణ చేశారు.
ఇది కాకుండా ఎయిర్‌టెల్ రూ. 1849 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో 3600 ఎస్ఎంఎస్ లు ఉచితంగా పొందుతారు. అయితే దీని వాలిడిటీ 365 రోజులపాటు వర్తిస్తుంది అంటే ఏడాది పాటు రీఛార్జీ చేసుకునే అవసరం లేదు. ఇందులో మూడు నెలలపాటు 24/7 అపోలో సర్కిల్ ఉచితంగా పొందుతారు. ఇది కాకుండా హలో ట్యూన్స్ కూడా ఉంటాయి.
ట్రయ్ ఆదేశాల మేరకు చౌక ధరల ఎయిర్‌టెల్ వాయిస్ ఓన్లీ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో ఫీచర్ ఫోన్లు ఉపయోగించే కస్టమర్లు అంటే డేటా ఉపయోగించలేని కస్టమర్లకు ఇది బంపర్ బెనిఫిట్. అంతే కాదు ఇది కొన్ని కోట్ల మంది వినియోగదారులకు భారీ ప్రయోజనం చేకూరుస్తుంది