Maha kumbh: మహా కుంభమేళా మరో అరుదైన రికార్డు.. కీలక ప్రకటన చేసిన యోగి ప్రభుత్వం.. స్టోరీ ఏంటంటే..?

Cm Yogi adityanath on kumbh mela: కుంభమేళకు ఇంకా భక్తులు వస్తునే ఉన్నారు. ఈ క్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటన చేశారు.

1 /6

ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళకు ప్రతిరోజు కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. 144 ఏళ్ల తర్వాత ఏర్పడిన మహా కుంభంలో ఎలాగైన పుణ్యస్నానాలు ఆచరించాలని కూడా భక్తులు భావిస్తున్నారు.

2 /6

కుంభమేళకు రైళ్లు, విమానాలు, బస్సులు, సొంత వాహానాల్లో భక్తులు చేరుకుంటున్నారు. అయితే.. కుంభమేళకు వెళ్లే భక్తుల తాకిడి విపరీతంగా ఉంది. దీంతో ఇండియన్ రైల్వేస్ సైతం కుంభమేళకు వెళ్లే వారికోసం ప్రత్యేకంగా రైళ్లను ఏర్పాటు చేసింది.  

3 /6

ఈ క్రమంలో ఇప్పటి వరకు కుంభమేళలో పుణ్యస్నానాలు ఆచరించిన వారు దాదాపుగా.. 55 కోట్ల మంది వరకు ఉంటారని యూపీ సర్కారు ప్రకటించింది. అంటే మన దేశ జనాభా.. 110 కోట్లుగా భావించిన కూడా అందులో దాదాపుగా ఎక్కువగా మంది ఇప్పటికే పుణ్యస్నానాలు ఆచరించారు

4 /6

ఫిబ్రవరి 26న మరో షాహిస్నానం ఇంకా మిగిలి ఉంది. ఈ క్రమంలో ప్రయాగ్ రాజ్ కు  ఇంకా భక్తులు పొటెత్తుతున్నారు. అదే విధంగా ఫిబ్రవరి 26 వరకు ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని.. దాదాపుగా.. 60 కోట్ల వరకు పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల సంఖ్య ఉండవచ్చని యూపీ సర్కారు వెల్లడించింది.

5 /6

ఈ నేపథ్యంలో జనవరి 13న ప్రారంభమైన కుంభమేళ.. ఫిబ్రవరి 26తో ముగియనుంది. కుంభమేళకు మన దేశం నుంచి మాత్రమేకాకుండా.. ప్రపంచ దేశాల నుంచి భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మన దేశ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ లు, మంత్రులు, అధికారులంతా కుంభమేళలో పుణ్యస్నానాలు ఆచరించారు.

6 /6

మరోవైపు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా భారీగానే సెలబ్రీటీలు ప్రయాగ్ రాజ్ కు వెళ్లి పుణ్యస్నానాలు ఆచరించారు. చాలా మంది  భక్తులు ఎలాగైన ప్రయాగ్ రాజ్ వెళ్లాలని కూడా చివరి వరకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు యూపీ సర్కారు సైతం.. కుంభమేళకు వచ్చే భక్తులకు ఎక్కడకూడా ఇబ్బందులు తలెత్తకుండా.. కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూ..కుంభమేళను విజయవంతంగా నిర్వహిస్తుంది.