Petrol Diesel Price: కేంద్రంలోని మోదీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అమల్లోకి తీసుకువచ్చింది. జీఎస్టీ రాకతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా విధించే ట్యాక్స్ లు తగ్గిపోయి ఒక ట్యాక్స్ అమల్లోకి వచ్చింది. అయితే పెట్రోల్, డీజిల్ ను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఎప్పటినుంచో డిమాండ్ వినిపిస్తోంది.
ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధనంపై విడివిడిగా ట్యాక్స్ లు వేస్తున్నాయి. దీంతో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఉంటున్నాయి. వీటిని కూడా జీఎస్టీ కిందికి తీసుకువస్తే ధరలు భారీగా తగ్గే ఛాన్స్ ఉంది. దీంతో వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని అంటున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. తాజాగా దీని గురించి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ ప్రకటన చేశారు.
2025-26 ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ లో వేతన జీవులకు భారీ ఊరట కలిగిస్తూ ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.12లక్షలకు పెంచింది. తాజాగా బడ్జెట్ అనంతరం దేశ వాణిజ్య రాజధాని ముంబైలో పారిశ్రామికవేత్తలతో జరిగిన ఇంటరాక్షన్ సెషన్ లో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.
ఈ చర్చలో మధ్యతరగతి క్లాస్ వర్గాలకు ముఖ్యమైన ట్యాక్స్ ప్రయోజనాలు కల్పించడం, గిగ్ వర్కర్స్ కి సోషల్ సెక్యూరిటీ చర్యలు తీసుకోవడంపై డిస్కస్ చేశారు. ఈ ప్రోగ్రామ్ లో నిర్మలా సీతారామన్ కొన్ని విషయాలపై క్లారిటీ కూడా ఇచ్చారు.
దేశంలో ఉద్యోగాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని..ఆ దిశగా ప్రభుత్వ ప్రణాళికలు అమలు చేస్తోందని దేశ ఆర్ధిక వ్రుద్ధికి కీలక రంగాలపై ఎంఎస్ఎంస్ఈ లు వ్యవసాయంపై పెట్టుబడులు పెంచే దిశగా కేంద్ర వడివడిగా అడుగులు వేస్తుందన్నారు.
ఈ సందర్భంగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్..రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్స్ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం గురించి అడిగిన ప్రశ్నకు ఆమె రెస్పాండ్ అయ్యారు. ప్యుయల్ ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు.
ఇప్పటి వరకు ఏ నిర్ణయమైనా ఏకగ్రీవంగా తీసుకున్నామని..ఇకపై కూడా అదే విధంగా ఉంటుందని రిపోర్టర్లకు చెప్పారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ పై వాల్యూ యాడెడ్ ట్యాక్స్ , సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ వంటి పన్నులు అమలవుతున్నాయి. అందుకే పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు వేర్వురుగా ఉన్నాయి.