Lemon Remedies: ప్రకృతిలో విరివిగా లభించే పదార్ధాల్లో అద్భుతమైంది, భారీగా పోషక గుణాలు కలిగింది నిమ్మకాయ. ఇందులో విటమిన్ సి పెద్దఎత్తున ఉండటం వల్ల ఇమ్యూనిటీ పటిష్టంగా ఉంటుంది. ఫలితంగా వివిధ రకాల వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. రోజూ నిమ్మకాయ సేవిస్తే కలిగే లాభాలు కలలో కూడా ఊహించలేరు.
లివర్ హెల్త్ లెమన్ అనేది లివర్‌ను డీటాక్స్ చేయడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. రోజూ ఉదయం వేళ లెమన్ టీ లేదా లెమన్ వాటర్ తాగడం వల్ల లివర్‌లో ఉండే విష పదార్ధాలు పూర్తిగా తొలగిపోతాయి.బాడీ డీటాక్స్ అవుతుంది.
లెమన్ టీలో చాలా పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ ఇ పెద్దఎత్తున ఉంటాయి.
మెరుగైన ఆరోగ్యం లెమన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. లెమన్ రోజూ తీసుకుంటే ఇమ్యూనిటీ బలపడుతుంది. వివిధ రకాల వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది.
లెమన్ టీ ఆధునిక జీవన విధానంలో ప్రధాన సమస్యగా మారిన బరువును నియంత్రించలేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. లెమన్ టీ ఇందుకు చాలా లాభదాయకం. నిమ్మకాయలో ఉండే పోషక గుణాలు కొవ్వుని వేగంగా కరిగిస్తాయి. బరువు తగ్గేందుకు దోహదమౌతుంది
బ్యాక్టీరియా నుంచి రక్షణ మీకు తరచూ జలుబు, దగ్గు బాధిస్తుంటే విటమిన్ సి లోపం ఉందని అర్ధం. ఈ క్రమంలో లెమన్ టీ తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనం కలుగుతుంది. లెమన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పెద్దఎత్తున ఉంటాయి. సీజనల్ వ్యాధుల్నించి రక్షణ లభిస్తుంది.