Keerty Suresh Wedding Photos: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి ఈరోజు హిందూ సంప్రదాయంలో వైభవంగా జరిగింది. తన చిన్ననాటి క్రిస్టియన్ స్నేహితుడైన అంటోనీ తట్టిల్‌ను ఈరోజు ఘనంగా హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకుంది. కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కీర్తి సురేష్ ఈ మహానటి తమిళ, తెలుగు, మలయాళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందింది. ఆమె నటనకు గాను నేషనల్ ఫిలిం అవార్డు కూడా దక్కించుకుంది.
ఈరోజు తన చిన్ననాటి స్నేహితుడైన అంటోనీ తట్టీల్తో ఆమె పెళ్లి వైభవంగా గోవాలో జరిగింది ప్రస్తుతం ఆమె పెళ్లికి ఫోటో పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్ వైరల్ గా మారాయి.
కీర్తి సురేష్ వాళ్ళ తండ్రి కూడా జి. సురేష్ కుమార్ సినీ ప్రొడ్యూసర్ గా పని చేశాడు. తల్లి కూడా మేనక ఈమె కొన్ని తెలుగు చిత్రాల్లో కూడా పనిచేసింది. కీర్తి సురేష్ తన కెరీర్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్‌ను ప్రారంభించింది.
ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ లో పట్టా పొందిన తర్వాత సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. కీర్తి సురేష్ నటనకు గాను సైమా (SIIMA) అవార్డ్స్, బెస్ట్ ఫిమేల్ అవార్డు పొందింది.
కీర్తీ సురేష్ నటించిన సావిత్రి బయోపిక్ 'మహానటి' అయితే తనకు ప్రత్యేక గుర్తింపును తీసుకురావటమే కాకుండా ఫిలింఫేర్ అవార్డు, నేషనల్ ఫిలిం యాక్టర్స్ అవార్డు దక్కించుకునేలా చేశాయి.
ఇక నానితో నటించిన 'దసరా' మూవీ కూడా బెస్ట్ ఫిలింఫేర్ అవార్డు పొందింది. ఇలా తెలుగు, తమిళ, మలయాళ ఇండస్ట్రీలో తనకంటూ ఇలా ప్రత్యేకమైన గుర్తింపు పొందింది కీర్తీ సురేష్.
కీర్తి సురేష్ కేరళలోని తిరువనంతపురం మలయాళీ కుటుంబంలో జన్మించింది. ఈమెకు నటనే కాదు వాయోలీన్ ప్లే చేయడం కూడా ఇష్టమట.
నేడు డిసెంబర్ 12వ తేదీ గురువారం గోవా వేదికగా తన చిన్ననాటి స్నేహితుడైన అంటోనీ తట్టిల్ ను హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం కీర్తీ సురేష్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈమె పెళ్లికి హీరో విజయ్, నాని ఇతర సెలబ్రిటీలు కూడా వచ్చారు.