Mutual Funds: ఒకప్పుడు చాలామంది రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే నిర్లక్ష్యంగా చూసేవారు. ఇప్పుడే తొందర ఏముంది అంటూ పెట్టుబడిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. రోజులు మారాయి. చాలామంది యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగంలో చేరగానే రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తున్నారు. మీరు రోజుకు 270 రూపాయలు పొదుపు చేస్తే 8కోట్లు మీ చేతికి వస్తాయి. ఎలాగో తెలుసుకుందాం.
Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ చేయడం మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా కాలక్రమమైన పెద్ద మొత్తంలో డబ్బు కూడబెట్టుకోవచ్చు. కాంపౌండింగ్ పవర్ తో మీ ఇన్వెస్ట్మెంట్ చాలా రేట్లు పెరుగుతుంది. నెలకు కేవలం రూ. 8వేల రూపాయలతో సిప్ చేస్తే రిటైర్మెంట్ నాటికి రూ.8 కోట్లు సంపాదించవచ్చు. అంటే రోజుకు రూ. 270 రూపాయలు పొదుపు చేస్తే సరిపోతుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా నిర్ణీత సమయంతో నిర్ణీత మొత్తాన్ని క్రమంగా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. మీ ఆర్థిక పరిస్థితులు అవసరాలకు అనుగుణంగా రోజు, వారము, నెలా, ఆరు నెలలు లేదా ఏడాదికి ఒకసారి పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. అతి తక్కువ మొత్తంలో కూడా పెట్టుబడి పెట్టే ఛాన్స్ ఉంటుంది. కేవలం రూ.500 రూపాయలతో రిటర్మెంట్ ప్లానింగ్ జర్నీని ప్రారంభించవచ్చు.
సిప్ ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించడానికి భారీ మొత్తంలో డబ్బు అవసరం లేదు. కేవలం ఒక చిన్న మొత్తం ఉన్నా సరిపోతుంది. రెగ్యులర్ పెట్టుబడులు ఆర్థిక క్రమశిక్షణను ఇవి పెంపొందిస్తాయి.
దీర్ఘకాలంలో మీ డబ్బు కాంపౌండింగ్ పవర్ తో వేగంగా పెరిగిపోతుంది. సంపాదించిన వడ్డీ పై కూడా రిటర్న్స్ అందుతుంటాయి. సిప్ ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి వాటిని సాధించడానికి ఎంతగానో సహకరిస్తాయి.
పెట్టుబడుల విషయానికి వస్తే సమయం మీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎంత త్వరగా ప్రారంభిస్తే.. మీ డబ్బు అంత తొందరగా వృద్ధి చెందడానికి సమయం లభిస్తుంది. కాంపౌండింగ్ పవర్ మంచి రిటర్న్స్ అందిస్తుంది. ప్రారంభ పెట్టుబడులు ఎలా ఎంత తేడాను చూపుతాయో ఓసారి చూద్దాం
మొదటి పెట్టుబడి 25 ఏళ్ల వయసులో ప్రారంభించారు అనుకుంటే.. 20 సంవత్సరాల పాటు నెలకు రూ. 5000 ఇన్వెస్ట్ చేస్తే మొత్తం పెట్టుబడి 12 లక్షలవుతుంది మెచ్యూరిటీ మొత్తం రూ. 50 లక్షల కు చేరుకుంటుంది.
రెండో ఇన్వెస్టర్ 35 ఏళ్ల వయసు నుంచి ప్రారంభించారనుకుంటే 20 సంవత్సరాల పాటు నెలకు 5000 పెట్టుబడి పెడితే మొత్తం ఇన్వెస్ట్ రూ.12,00,000 కాగా, మెచ్యూరిటీ మొత్తం (12% వార్షిక రాబడితో) రూ.28,00,000 చేతికి వస్తుంది.
అంటే 10ఏళ్లకు ముందు పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే మొదటి పెట్టుబడి రూ. 22,00,000 ఎక్కువ సంపాదిస్తారు. కాంపౌండింగ్ ఎనర్జీతో ఈ భారీ వ్యత్యాసం కనిపిస్తుంది.
మీ లక్ష్యం రిటైర్ మెంట్ కోసం రూ. 8కోట్లు సంపాదించడం అయితే 12శాతం వార్షిక రాబడితో రూ. 8000నెలవారీ సిప్ తో ఎంత కాలం పడుతుందో తెలుసుకుందాం.
10ఏళ్ల తర్వాత: మొత్తం ఇన్వెస్ట్ మెంట్: రూ.9,60,000.. రిటర్న్స్: రూ.8,98,713.. కార్పస్: రూ.18,58,713. 20ఏళ్ల తర్వాత: మొత్తం పెట్టుబడి మొత్తం: రూ.19,20,000, రిటర్న్స్: రూ.60,73,183, కార్పస్: రూ.79,93,183. 30ఏళ్ల తర్వాత: మొత్తం ఇన్వెస్ట్ మెంట్: రూ.28,80,000, రిటర్న్స్: రూ.2,53,59,310, కార్పస్: రూ.2,82,39,310.
39ఏళ్ల తర్వాత: మొత్తం ఇన్వెస్ట్ మెంట్ రూ.37,44,000. రిటర్న్స్: రూ.8,05,25,416. కార్పస్: రూ.8,42,69,416. మీ లక్ష్యాన్ని 39ఏళ్లలో సాధించవచ్చు.