HMPV: చైనా వైరస్‌ వ్యాప్తి.. గాంధీ ఆసుపత్రిలో సర్వం సిద్ధం..!

HMPV Virus Spread: చైనా వైరస్‌ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట కర్నాటకలోని ఇద్దరు చిన్నారులకు హెచ్‌ఎంపీవీ పాజిటివ్‌ వచ్చింది. ఆ తర్వాత గుజరాత్‌, చెన్నైలో కూడా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
 

1 /5

హెచ్‌ఎంపీవీ వైరస్‌ కరోనా ప్రమాదకరం కాదని గాంధీ ఆసుపత్రి వైద్యులు చెప్పారు. ఇది సాధారణ ఇన్‌ఫ్లూయెంజా మాత్రమే వారంలో తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే వైరస్‌ వ్యాప్తి చెందుతే ఆ రోగులకు ప్రత్యేక ఏర్పాట్లు గాంధీలో చేశారు.  

2 /5

ముఖ్యంగా 600 ఆక్సిజన్‌ బెడ్స్‌, 40 వేల లీటర్ల లిక్విడ్‌ ఆక్సిజన్‌, 450 వెంటిలేటర్స్, 400 మానిటర్స్‌, పీడియాట్రిక్‌ వెంటిలేటర్ల ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.  

3 /5

ఈ వైరస్ 2001 నుంచే ఉంది. శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూసుతుందని మంత్రి దామోదర రాజనర్సింహ కూడా చెప్పార. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతుంది అన్నారు.  

4 /5

ఇక హెచ్‌ఎంపీవీ వైరస్‌ గురించి ఆందోళన వద్దన WHO మాజీ చీఫ్‌ సైంటిస్ట్‌ డా. సౌమ్య స్వామినాథన్‌ కూడా తెలిపారు. ఈ వైరస్‌ కొత్తగా వచ్చిందేమి లేదు. గతంలోనే వచ్చిందనన్నారు. జలుపు చేసినప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా బయటపడవచ్చు అన్నారు.  

5 /5

కరోనా సమయంలో డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ సైంటిస్ట్‌గా సౌమ్య పనిచేశారు. ఇక గాంధీ ఆసుపత్రిలో కరోనా సమయంలో అన్ని ఏర్పాట్లను చేసి తగిన చికిత్సను అందించిన సంగతి తెలిసిందే. ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రస్తుత హెచ్‌ఎంపీవీ వ్యాప్తి నేపథ్యంలో మరోసారి సిద్ధం చేశారు.