Happy Valentines Day: ప్రపంచవ్యాప్తంగా రేపు ప్రేమికుల దినోత్సవం అత్యంత ఘనంగా జరగనుంది. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే పురస్కరించుకుని ప్రేమికులు ఒకరి నొకరు ప్రేమను వ్యక్త పర్చుకునే అవకాశం. మీ ప్రేమను అందమైన పదాలతో ..మనస్సును హత్తుకునేలా చెప్పాలనుకుంటే...మీ కోసమే ఈ అందమైన వాలెంటైన్స్ డే విషెస్..కోట్స్. మెస్సేజెస్ తెలుగులో.
Happy Valentines Day: ప్రేమికులు ఎప్పుడూ చెప్పుకునే ఐ లవ్ య. ఈ మూడు పదాలు రొటీన్. కాస్త మనస్సును ఆకట్టుకునేలా, ఆలోచింపచేసేలా రెండు మూడు వాక్యాలతో ప్రేమను వ్యక్తపరిస్తే అంతకంటే ఆనందం మరేముంటుంది. అందుకే మీ కోసం ఈ విషెస్
నాకు ఒంటరిగా నిద్ర పట్టదు..కలలో రావచ్చు కదా... నీవు లేకుండా ఉండలేను..నాకు ఆసరాగా ఉండొచ్చు కదా... హ్యాపీ వాలెంటైన్స్ డే
నీవే నా గమ్యం...నీవే నా ఆరాధాన... నీవే నా దేవత...నీవే నా దేవత... కాస్త నా కళ్లు చూస్తే చాలు... నేను నీకు ఏంటో అర్ధమౌతుంది... హ్యాపీ వాలెంటైన్స్ డే
నీవు లేని ఈ మనసు ఒక్క క్షణమైనా నిలువనంటోంది... అందుకే మనస్ఫూర్తిగా నిన్నే కోరుకుంటా... నేను లేకున్నా ప్రేమ మాత్రం తగ్గదు... హ్యపీ వాలెంటైన్స్ డే
నీ కళ్లలో ఆ మైకంలో మునిగే ఉంటాను... మనసును నియంత్రించలేను..మనసు విప్పి చెప్పేస్తాను... నువ్వుంటే నాకు చాలా చాలా ఇష్టం... హ్యాపీ వాలెంటైన్స్ డే
ఏ వైపు చూసినా..అటు నీవే... ఏ లోకాన మైమరిచిపోయావో... నన్ను చూసి కాస్త నవ్వితే చాలు..ఇదే చాలనుకుంటా... హ్యాపీ వాలెంటైన్స్ డే
నీవు నా కోసమే ఎలా పుట్టావనే ఆలోచనతో కాలం ఇలానే గడిపేస్తుంటా... ఎక్కడో నక్షత్రాల్లో ఉండే నిన్ను... నా కోసమై భువిపైకి రప్పించారా... నా మనసులో ఎప్పుడూ ఇదే ఆలోచన... నీ కళ్లు..నీ రూపం..అంతా నాదేనా... నీ పెదాలు..నీ కౌగిలి అంతా నాదే... హ్యాపీ వాలెంటైన్స్ డే
నీ కోసం ప్రతి రోజూ బతికేస్తాను... నా సమయం అంతా నీకే వెచ్చించాను... నీవు లేని నా క్షణమే లేదంటే నమ్మగలవా... ఆఖరికి ప్రతి శ్వాసపై కూడా నీ పేరే... హ్యాపీ వ్యాలెంటైన్స్ డే
నీ కోసమే...బతికేస్తున్నా... నీ తలపే ఆలోచిస్తున్నా... నీకై చూసే ప్రతి నిమిషం సదా నిలవాలని కోరుకుంటూ.. హ్యాపీ వ్యాలెంటైన్స్ డే
నీతో కలిసిన ఆ క్షణం... కావాలంటోంది ప్రతి క్షణం... ఎవరు ఔనన్నా...కాదన్నా నీవే నా సర్వస్వం... హ్యాపీ వ్యాలెంటైన్స్ డే
నీ కళ్లలోనే ఉంది నా ప్రపంచమంతా... నేను చెప్పలేకపోవచ్చు గానీ నీవు వినగలవనుకుంటా... నా ప్రపంచం నీవే..నా భరోసా నీవే... హ్యాపీ వ్యాలెంటైన్స్ డే
నీ మైకంలో..నేనేమయ్యానో నాకే తెలియదు. నీ రాకకై నే చూసిన ప్రతి నిరీక్షణ ఎప్పటికీ మధురమే... నా ప్రేమ నీవీ..నా తలపు నీవే...నా ప్రతి ఆలోచన నీవే... హ్యాపీ వ్యాలెంటైన్స్ డే
నీవొచ్చినట్టున్నావు..అందుకే ఆ పరిమళం.. నిజంగా నీవు రాకపోయినా...ఆ పరిమళం మాత్రం దూరం కానివ్వకు... ఆ తలపుతోనే బతికేస్తా... హ్యాపీ వాలెంటైన్స్ డే
నీవు ఉన్నావనే ఊహ చాలు..పది కాలాలు బతికేందుకు అదే ఊహ నిజమైతే ఇక ఈ జన్మ సార్ధకమే.. హ్యాపీ వాలెంటైన్స్ డే