Beer Supply Restore: మందుబాబులకు కిక్కేక్కించే వార్త.. తెలంగాణలో బీర్ల సరఫరా పునరుద్ధరణ

Beer Supply Restoration In Telangana State: మందుబాబులకు భారీ శుభవార్త. నిలిపివేసిన బీర్ల సరఫరాను పునరుద్ధరణ చేశారు. బీర్ల సరఫరా నిలిపివేసిన కంపెనీలు తాజాగా వాటిని పునరుద్ధరణ చేస్తున్నట్లు ప్రకటించాయి. అత్యధికంగా అమ్ముడయ్యే కింగ్‌ ఫిషర్‌తోపాటు హైన్‌కెన్‌ బీర్ల సరఫరా నిలిపివేతపై కంపెనీలు వెనకడుగు వేశాయి.

1 /6

తెలంగాణలో బీర్ల సరఫరాపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. మద్యం దుకాణాల్లో బీర్ల నిల్వ లేకపోవడంతో మందుప్రియులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో యునైటెడ్‌ బ్రూవరీస్‌ సంచలన నిర్ణయం తీసుకుంది.

2 /6

మందుబాబులు ఆందోళన చెందుతున్న వేళ బీర్ల నిల్వలపై యుబీ సంస్థ స్పందించింది. బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ ప్రకటించింది.

3 /6

బీర్ల సరఫరాపై ఆ కంపెనీ పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వంతో సంస్థ చర్చలు జరుపుతోంది. ప్రస్తుతానికి బీర్లను పునరుద్ధరించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన చేసింది.

4 /6

బీర్ల కంపెనీలు వెనకడుగు వేయడంతో బీర్ల ధరల పెంపు, పాత బకాయిల విడుదలపై బేవరేజ్ కార్పొరేషన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బీర్ల సరఫరా పునరుద్ధరణ చేస్తున్నట్లు యూబీ ప్రకటించింది.

5 /6

వినియోగదారులు, కార్మికులు, వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా మధ్యంతర నిర్ణయం తీసుకున్నట్లు యూబీ సంస్థ తెలిపింది. కంపెనీ వెనకడుగు వేయడంతో తెలంగాణలో కొరతగా ఉన్న బీర్లు తిరిగి నిండుకోనున్నాయి.

6 /6

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం రెండు త్రైమాసికాలకు కలిపి దాదాపు రూ.900 కోట్లు రావాల్సి ఉండడంతో బీర్ల కంపెనీలు సరఫరా నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా సంస్థ వెనక్కి తీసుకోవడంతో బీర్ల సరఫరా యథావిధిగా జరగనుంది.