Prabhas- Hanuman Raghavapudi: ప్రభాస్ తాజా చిత్రం ఫౌజీ.. అగ్రహారం నేపథ్యంతో సాగనుందని టాలీవుడ్‌లో ఒక వార్త తెగ వినిపిస్తోంది. బ్రాహ్మణ యువకుడిగా ప్రభాస్ కనిపించనున్నారని కూడా సమాచారం. సీతారామన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉండగా.. ఈ సినిమా గురించి ఎన్నో విశేషాలు సినీ వర్గాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే
ప్రభాస్.. ప్రస్తుతం సీతారామం వంటి హిట్ చిత్రం అందించిన.. దర్శకుడు హనూ రాఘవపూడితో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌తో కలిసి ఓ ఆసక్తికరమైన కథను.. ఈ దర్శకుడు తెరపైకి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా పేరు..ఫౌజీ అంటూ టాలీవుడ్‌లో హడావుడి జరుగుతోంది.
ఈ క్రమంలో ఈ సినిమా కథ గురించి కూడా కొన్ని విశేషాలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రధాన విశేషం ఏమిటంటే.. ఈ సినిమా అగ్రహారంలో ఉంది.. ఒక సాంప్రదాయమైన ఫ్యామిలీలో పుట్టిన ఒక బ్రాహ్మణుడి కథ చుట్టూ తిరుగుతుందంట. ప్రభాస్ ఇందులో బ్రాహ్మణ యువకుడిగా కనిపించనున్నారని సమాచారం. ఇది సీతారామం తరహాలో ప్రేమకథ అయినా, కథా పరిణామాలు.. పూర్తిగా విభిన్నంగా ఉంటాయి అని తెలుస్తోంది.
ఈ చిత్రంలో మదురై ప్రాంతంలోని వివిధ ప్రదేశాల్లో చిత్రీకరణ జరుగనుంది. ముఖ్యంగా, కరైకూడి ప్రాంతంలోని దేవిపురం అగ్రహారంలో.. కీలకమైన సన్నివేశాలను షూట్ చేయాలనేది టీమ్ ప్రణాళిక అని సమాచారం. ఇది బౌద్ధిక సంప్రదాయాలకు ప్రసిద్ధిచెందిన ప్రదేశంగా పేరుగాంచింది. అందుకే ఈ స్థలాన్ని సినిమా యూనిట్ ఎంచుకున్నారని వినికిడి.
ప్రభాస్ బ్రాహ్మణ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి.. ఈ అగ్రహారంలో 20 రోజుల పాటు ప్రత్యేకంగా షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. అయితే ఈ షెడ్యూల్ ఎప్పుడు ఉంటుంది అని..ఖచ్చితమైన తేదీలు ఇంకా ప్రకటించలేదు. ఈ చిత్రంలో ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. ప్రభాస్, ఇమాన్వి జంటపై అభిమానుల్లో ఇప్పటికే విపరీతమైన ఆసక్తి నెలకొంది.
ఇమాన్వి ప్రభాస్ సరసన తొలిసారిగా నటించనుండటంతో, వారి జంట తెరపై ఎలా కనిపిస్తుందో అన్నది ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచుతోంది.
ప్రస్తుతం ఫౌజీతో పాటు ప్రభాస్ రాజా సాబ్, సలార్ 2, స్పిరిట్ వంటి చిత్రాల్లో కూడా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన కల్కి 2898 ఎడీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. కాగా ఫౌజీ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. టీమ్ ఈ చిత్రాన్ని సంవత్సరం చివర్లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఈ సినిమా గురించి మరిన్ని అప్‌డేట్స్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.