Shukra Gochar: శుక్రుడి రాశి మార్పుతో ఈ రాశుల వారి పంట పండినట్టే..పెళ్లి కానీ వారికీ జాక్ పాటే..

Shukra Gochar: నవగ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశిలోకి నిరంతరం సంచరిస్తూ ఉంటాయి. దీని వలన కొన్ని రాశలు వారికీ అనుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికీ ప్రతికూలంగా ఉండే అవకాశాలున్నాయి. తాజాగా శుక్రుడు ఈ రోజు వృషభ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. శుక్ర సంచారంతో కొన్ని రాశుల వారికీ పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా సాగిపోనుంది.

1 /6

Shukra Gochar: జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడికి ప్రత్యకమైన స్థానం ఉంది. ఇది విలాసవంతమైన గ్రహం. శుక్రుడు ఉన్నత స్థితిలో ఉంటే.. జీవితంలో గౌరవం, సంపద, అందం, సంగీతం, కళ, కీర్తి వంటివి వాటంతట అవే వస్తాయి. శుక్రుడు గ్రహ మండలంలో వృషభం మరియు తులా రాశులకు అధిపతి.  

2 /6

శుక్రుడు అనుగ్రహం ఉంటే.. వారి జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవని నమ్ముతారు. ముఖ్యంగా జీవితంలో ఆర్ధికంగా ఎలాంటి కొరత ఉండదు. శుక్ర సంచారంతో కొంతమంది రాశివారి జీవితంలో శుక్ర దశ ప్రారంభమవుతోంది.

3 /6

మీన రాశి: శుక్రుడు మీన రాశిలో అనుకూలంగా ఉండనుంది. పెండింగ్ పనులు త్వరగా పూర్తయ్యే అవకాశాలున్నాయి. కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేయాలనే కల ఈ యేడాది నెరవేరబోతుంది. వివిధ సంస్థల నుండి డబ్బు ప్రవహించే అవకాశాలున్నాయి.  

4 /6

సింహ రాశి: శుక్రుడు రాశి మార్పుతో మీలో ఆత్మ విశ్వాసం పెరుగుతోంది. మీరు ఏ పని చేసినా విజయం సాధించే అవకాశాలున్నాయి. ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. మరింత మెరగయ్యే అవకాశాలున్నాయి.

5 /6

మిథున రాశి: శుక్రుడు రాశి మార్పుతో మీ అదృష్టం కలిసొచ్చే అవకాశాలున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం దొరికే అవకాశాలున్నాయి. పారిశ్రామిక వేత్తలు భారీగా లాభాలను అందుకోవచ్చు. ఆర్ధికంగా నిలదొక్కుకుంటారు. 

6 /6

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ప్రజల సాధారణ నమ్మకాలు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారపడి ఉంటుంది. ZEE తెలుగు న్యూస్ దానిని ధృవీకరించడం లేదు.