Chhaava Movie: చావా సినిమా ప్రస్తుతం అన్ని థియేటర్ లలో కూడా హౌస్ ఫుల్ తో దూసుకుపోతుంది. ఈ మూవీ రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే భారీగా వసూళ్లను రాబట్టింది.
మరాఠా యోధుడు ఛత్రపతి మహారాజ్ శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా చావా సినిమా తెరకెక్కింది. ఈ మూవీని వాలెంటైన్స్ డే ఫిబ్రవరి 14న విడుదల చేశారు. ఈ సినిమాను దర్శకుడు లక్ష్మణ్ ఊటేకర్ తెరకెక్కించారు.
ఈ మూవీలో విక్కి కౌశాల్ శంభాజీ మహారాజ్ గాను , రష్మిక మందన్న యేసు బాయ్ గా కూడా నటించారు. వీరి నటన చూసి థియేటర్ లో అభిమానులు ఒకవైపు నినాదాలు చేస్తు, మరొవైపు ఎమోషన్ కు గురై కన్నీళ్లను సైతం పెట్టుకుంటున్నారు.
మహారాష్ట్రలో ప్రాంతాలపై మొఘల్ దాడులు చేసినప్పుడు వారిని ఛత్రపతి మహారాజ్, ఆయన కుమారుడు శంభాజీ మహారాజ్ ఏవిధంగా ఎదుర్కొన్నారో అనే మెస్సెజ్ తో ఈ మూవీ తెరకెక్కింది. శంభాజీ మహారాజ్ మొఘల్స్ కు ఈ చుక్కలు చూపించాడు.
దీనిలో ఔరంగాజేబు పాత్రలో..(అక్షయ్ ఖన్నా)కు అదిరిపోయే విధంగా నటించారు. మొత్తంగా ఈ సినిమా మాత్రం.. అభిమానుల నుంచి ఒక రేంజ్ లో హిట్ ను సొంతం చేసుకుని రికార్డులను క్రియేట్ చేస్తుంది.ఈ క్రమంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ మూవీ గురించి చర్చించుకుంటున్నారు.
అయితే.. ఈ మూవీలో ప్రస్తుతం.. విక్కి కౌశాల్, రష్మిక మందన్న పాత్రలలో నటించారు. కానీ గతంలో దర్శకుడు లక్ష్మణ్ ఊటేకర్ఈ సినిమా కోసం.. సూపర్ స్టార్ మహేష్ బాబును సంప్రదించారంట. కానీ ఆయన ఈ మూవీ నటించేందుకు ఒప్పుకోలేదంట.
దీంతో దర్శకుడు లక్ష్మణ్ ఊటేకర్ ఈ కథను చాలా రోజులు పెండింగ్ లో పెట్టాల్సి వచ్చిందంట. అదే విధంగా హీరోయిన్ గా కత్రీనా కైఫ్ ను అనుకున్నారంట. ఆమె కూడా దీనికి ఒప్పుకోలేదంట. మొత్తంగా మహేష్ బాబు కనుకఈ మూవీని ఒప్పుకుంటే.. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ గా ఒక రెంజ్ లో ఆయన స్టార్ డమ్ సంపాదించేవాడని సినిమా క్రిటిక్స్ అంటున్నారు.
మొత్తంగా మహేష్ బాబు చేతులారా.. చావాలో నటించే చాన్స్ పొగొట్టుకున్నాడని అభిమానులు ఒకింత అసహానంతో ఉన్నారంట. ఈ సినామాలో నటించి ఉంటే.. తెలుగు వాడికి ఇదోక గౌరవంగా ఉండేదని కూడా ఆయన అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం ఈ చావా మూవీ ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.