Kavitha and Nara Lokesh: నారా లోకేష్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్న కల్వకుంట్ల కవిత.. తెరమీదకు కొత్త చర్చ.. మ్యాటర్ ఏంటంటే..

Kavitha follows nara Lokesh: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా రేవంత్ సర్కారుపై  సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చేస్తున్న అక్రమ వేధింపులను ఎప్పటికప్పుడు పింక్ బుక్ లో నమోదు చేస్తున్నామని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

1 /8

తెలంగాణలో రాజకీయాలు ప్రస్తుతం రసవత్తరంగా మారాయి.  సమ్మర్ కు ముందే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ల మధ్య వార్ మరింత హీట్ ను పుట్టిస్తున్నాయి. రేవంత్ ప్రభుత్వం బీఆర్ఎస్ అక్రమాల వల్ల రాష్ట్రంఅంత అప్పుల కుంపటిగా మారిందని సెటైర్ లు వేస్తున్నారు.  ఎక్కడ అవకాశం దొరికిన కూడా బీఆర్ఎస్ ను ఏకీ పారేస్తున్నారు.

2 /8

అయితే.. బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ఆరోపణల్ని తనదైన స్టైల్ లో తిప్పికొడుతుంది. కాంగ్రెస్ సర్కారు అమలు కానీ.. 420 హమీలు ఇచ్చి.. కన్పించిన దేవుళ్ల మీద ప్రమాణాలు చేసి తెలంగాణ ప్రజలతో పాటు, దేవుళ్లను కూడా మోసం చేశాడని దుయ్యబట్టారు.  

3 /8

ఈ నేపథ్యంలో ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ ను దాఖలు చేసింది. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, తెలంగాణలో మళ్లీ ఎన్నికలు రావడం పక్కా.. అని బీఆర్ఎస్ నేతలు జోస్యం చెబుతున్నారు. మరొవైపు  ప్రజలు పార్టీలు మారిన వారికి డిపాజిట్ లు సైతం రాకుండా.. కర్ర కాల్చి వాతలు పెడతారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.   

4 /8

కల్వకుంట్ల కవితను లిక్కర్ కేసులో కొన్ని నెలల పాటు ఢిల్లీలోని తీహార్ జైలులో ఉంచిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా.. కవిత చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కవిత మాట్లాడుతూ.. మాట మాట్లాడితే.. రేవంత్ సర్కారు కేసులు పెట్టి బీఆర్ఎస్ లీడర్లను, కార్యకర్తలపై కేసులు పెట్టి భయపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. 

5 /8

సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టగానే.. పోలీసులు వచ్చి వేధింపులు గురిచేస్తున్నారని విమర్శించారు. రేవంత్ సర్కారు చేస్తున్న ప్రతి ఒక్క అక్రమాలను, తప్పిదాలను తాము.. పింక్ బుక్ లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే లెక్కలన్ని తెల్చుతామని.. మిత్తితో సహా తిరిగి ఇచ్చేస్తామని కూడా మాస్ వార్నింగ్ ఇచ్చారు. 

6 /8

ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. దీనిపై  చాలా మంది కవిత .. ఏపీ మంత్రి నారాలోకేష్ గతంలో అపోసిషన్ లో ఉన్నప్పుడు ఆయన రెడ్ బుక్ అంటూ గత వైసీపీ తప్పిదాలపై మండిపడ్డారు. గతంలో నారా లోకేష్ పై కూడా అనేక ట్రోలింగ్స్ చేశారు.  టీడీపీ కార్యకర్తలు, నేతలపై అక్రమ కేసుల్ని సైతం బనాయించారు.  

7 /8

దీనిపై ఆయన యువగళం పాదయాత్రలలో తరచుగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను తాము.. రెడ్ బుక్ లో నమోదు చేస్తున్నామని.. తమ సర్కారు వచ్చిన వెంటనే తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని కూడా వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అనూహ్యంగా ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూటమి సర్కారు అఖండ మెజార్టీతో విజయం సాధించింది.  

8 /8

అంతే కాకుండా నారాలోకేష్ అత్యధిక మెజార్టీతో గెలవడం మాత్రమే కాకుండా.. ఏకంగా ఏపీ ఐటీ, విద్యాశాఖ, ఎలక్ట్రానిక్స్ శాఖలకు మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో కవిత పింక్ బుక్ కామెంట్స్..  అచ్చం నారా లోకేష్ రెడ్ బుక్  మాదిరిగా పోలీఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఫ్యూచర్ లో బీఆర్ఎస్ కూడా అధికారంలోకి రావడం పక్కా.. అంటూ కొంత మంది జోస్యం చెబుతున్నారు. మరికొందరు కవిత.. నారా లోకేష్ సెంటిమెంట్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో వేచీ చూడాలని కూడా సోషల్ మీడియాలో ఈ కామెంట్లను వైరల్ చేస్తున్నారు. మొత్తానికి పింక్ బుక్, రెడ్ బుక్ కామెంట్స్ మాత్రం ఇరు తెలుగు స్టేట్స్ లలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.