Ola Uber Dual Charges: ఓలా, ఉబర్‌ సంస్థలకు షాక్‌.. ఫోన్‌ను బట్టి ధరలపై కేంద్రం నోటీసులు

Government Seeks Uber And Ola About Dual Prices: ఫోన్‌ను బట్టి ధరలు వేస్తున్న క్యాబ్‌ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. ఐఫోన్‌కు ఒక ధర.. ఆండ్రాయిడ్‌ ఫోన్‌కు ఒక ధర నిర్ణయిస్తుండడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై క్యాబ్‌ సంస్థలకు నోటీసులు అందించింది.

1 /6

వినియోగదారులకు సేవల అందిస్తున్న కొన్ని యాప్‌లు.. కొన్ని సంస్థలు ఫోన్‌ను బట్టి ధరల్లో వ్యత్యాంసం చూపిస్తుండడంతో వినియోగదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆండ్రాయిడ్‌తో పోలిస్తే ఐఫోన్‌కు అధిక ధరలు నిర్ణయిస్తుండడంతో మండిపడుతున్నారు.

2 /6

ఫోన్‌ ఆధారంగా ధరలు నిర్ణయిస్తున్న క్యాబ్‌ సర్వీస్‌ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

3 /6

వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఓలా, ఉబర్‌ సంస్థలకు కేంద్ర వినియోగదారుల శాఖ నోటీసులు అందించారు.

4 /6

క్యాబ్‌ బుక్‌ చేసుకునే ఫోన్ల ఆధారంగా రేట్లు వేస్తున్నారని కేంద్ర ప్రభుత్వానికి వినియోగదారుల శాఖకు భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి.

5 /6

ఐఫోన్‌లో రైడ్‌ బుక్‌ చేస్తే ఒక ధర.. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో బుక్‌ చేస్తే మరో ధర వస్తుండడంతో వినియోగదారుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

6 /6

రెండు విధాలుగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఒకే రకమైన సేవకు వేర్వేరు ఛార్జీలు వసూలు చేయడంపై కేంద్ర వినియోగదారుల శాఖ ఓలా, ఉబర్‌ సంస్థలకు  నోటీసులు ఇచ్చింది. మరి ఈ నోటీసులపై ఉబర్‌, ఓలా సంస్థలు ఇచ్చే సమాధానంపై ఆసక్తి నెలకొంది.