EPFO Pension Calculator: పీఎఫ్ ఖాతాదారులకు భారీ షాక్ తగిలింది. అధిక పింఛను లెక్కింపు విధానంపై EPFO క్లారిటీ ఇచ్చింది. హయ్యర్ పెన్షన్‌కు అర్హత లేని EPFO పెన్షనర్లకు అనుసరించే లెక్కింపు విధానాన్నే.. అర్హత ఉన్న వారు పెన్షన్‌దారులకు కూడా అమలు చేయనున్నట్లు తెలిపింది. దీంతో కొత్త లెక్కలతో వచ్చే పెన్షన్‌లో భారీ కోత పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
పార్ట్-1, పార్ట్-2 కింద పెన్షనర్లకు పెన్షన్ లెక్కించనున్నారు. రూల్స్ ప్రకారం.. 2014 సెప్టెంబరుకు ముందు సర్వీసుకు పార్ట్-1 కింద.. 2014 సెప్టెంబరు తరువాత నుంచి రిటైర్మెంట్ వరకు పార్ట్-2 కింద లెక్కించి ఫైనల్ పెన్షన్ ఫిక్స్ చేయనున్నారు.
ఈ కొత్త విధానానికి కేంద్ర కార్మిక శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఈపీఎఫ్‌ఓ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.
పెన్షన్‌ను రెండు పార్టుల కింద లెక్కించనుండడంతో 30 శాతానికి పైగా పెన్షన్ కోత పడనుంది. గరిష్ట వేజ్ లిమిట్ రూ.6,500 నుంచి రూ.15 వేలకు పెంచిన సమయంలో EPFO ఈ నిబంధనను తీసుకువచ్చింది.
2014 సెప్టెంబరు 1వ తేదీకి ముందు చివరి సర్వీసు ఏడాది సగటు శాలరీ.. మొత్తం సర్వీసును కలిపి పెన్షన్ లెక్కించే వారు. అయితే గరిష్ఠ వేతన పరిమితి పెంపుతో రూల్స్ మార్చారు. చివరి ఐదేళ్ల సగటు వేతనాన్ని తీసుకుని పెన్షన్ లెక్కించే విధానం తీసుకువచ్చారు.
ఆ తరువాత మళ్లీ నిబంధనల్లో మార్పులు చేశారు. ఐదేళ్ల వేతన సగటు కాకుండా రెండు పార్టుల విధానాన్ని ప్రవేశపెట్టారు. పార్ట్-1, పార్ట్-2 కలిపి ఫుల్ పెన్షన్‌గా ఈపీఎఫ్‌ఓ అందిస్తోంది.
ఉదాహరణకు ఓ ప్రభుత్వ ఉద్యోగి 1999లో ఉద్యోగంలో చేరి.. 2021లో రిటైర్మెంట్ అయ్యారని అనుకుంటే.. రెండేళ్ల బోనస్ లభిస్తుంది. మొత్తం 24 ఏళ్ల సర్వీసుకు పెన్షన్ లెక్కించాలి.
2014 సంవత్సరం నాటికి సగటు వార్షిక వేతనం రూ.22 వేలుగా ఉంది. రిటైర్మెంట్ నాటికి.. లాస్ట్ ఐదు సంవత్సరాల యావరేజ్ శాలరీ రూ.40 వేలు. పాత నిబంధనల ప్రకారం.. చివరి ఐదేళ్లకు లెక్కిస్తే.. రూ.13,714 పెన్షన్ రావాలి.
అయితే పార్ట్-1, పార్ట్-2 విధానం కింద లెక్కించడంతో కోత పడుంది. పార్ట్-1 కింద రూ.5,342, పార్ట్-2 కింద రూ.4,000 మొత్తం కలిపి రూ.9,342గా ఫైనల్ పెన్షన్ ఫిక్స్ అవుతుంది. దీంతో నెలకు రూ.4,372 పెన్షన్ నష్టపోవాల్సి ఉంటుంది.
ఈ విధానంపై కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. 2014 సెప్టెంబరుకు ముందు రూల్స్‌నే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.