Tirumala Tirupati Devasthanam: తిరుమల వెళ్లే భక్తులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నో రోజులుగా శ్రీవారి దర్శనానికి ఎదురు చూస్తుంటారు. దీనికి కొందరు మూడు నెలలు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకుంటారు. టోకెన్లు దొరకలేనివారు సర్వదర్శనం ద్వారా స్వామివారి దర్శనానికి గంటల తరబడి ఎదురు చూస్తుంటారు. ఇలా కాకుండా ఎలాగైనా శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే బ్లాక్‌లో ఎక్కువ రేట్లకు టిక్కెట్లు విక్రయిస్తారు. ఇక అలాంటి కష్టాలకు చెక్‌పడనుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్లి శ్రీవేంకటేశుని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు ఎదురు చూస్తుంటారు. టోకెన్లు దొరకక ఎక్కువ సమయంపాటు గడపలేనివారు తప్పనిసరిగా ఎక్కువ డబ్బులు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.
తిరుమల రూ.300 టికెట్లు ఆన్లైన్లో మూడు నెలలు ముందుగా విక్రయించడంతోపాటు వివిధ రాష్ట్రాల టూరిజం విభాగాలు, ఆర్టీసీలకు కేటాయించేవారు. వీరు బ్లాక్‌లో ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
దీంతో టీటీడీ ఈ విధానాన్ని రద్దు చేసింది.ఇప్పుడు పూర్తిగా ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలోనే దర్శనం కల్పించనుంది. ఈ విధివిధానాలపై త్వరలో క్లారిటీ రానుంది. పర్యాటక శాఖ ద్వారా దర్శన సౌకర్యాలను పునరుద్ధరించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అదనపు ఖర్చు లేకుండా శ్రీవారి దర్శనభాగ్యం కల్పించనుంది ఏపీ ప్రభుత్వం. ఇదిలా ఉండగా తిరుమల కల్తీ నెయ్యి కేసులో నలుగురు నిందితులను ఇటీవల అదుపులోకి తీసుకుంది సీట్. వారిని మున్సిఫ్ కోర్టు పోలీస్ కస్డడీకి అనుమతిచ్చింది.
కల్తీ నెయ్యి కేసులో నిందితులు శ్రీవైష్ణవి డెయిరీ డైరెక్టర్లు వివేక్ జైన్, పోమిల్ జైన్, ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖర్, అపూర్వ చావ్డాలను మొత్తం ఐదు రోజులపాటు పోలీసు కస్డడీకి అనుమతి ఇచ్చింది. ఈ కేసులో నలుగురు నిందితులను ఆదివారం అరెస్ట్ చేసిన సిట్ అదే రోజు కోర్టులో హాజరుపరిచారు.