Aadhaar Card: ఆధార్‌ కార్డుపై ఎన్నిసార్లు ఇంటి అడ్రస్‌ మార్చుకోవచ్చు? ఆ లిమిట్‌ తెలుసా?

Aadhaar Card Address Change Limit: ఆధార్‌ కార్డు మన దేశంలో ప్రతిఒక్కరూ కలిగి ఉండటం తప్పనిసరి. ఏ ప్రభుత్వ, ప్రైవేలు రంగాలకు సంబంధించిన పని పూర్తి చేయాలన్నా ఆధార్‌ కార్డు తప్పనిసరి. స్కూలు పిల్లల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులకు కూడా ఆధార్‌ తప్పనిసరి. అయితే, ఈ ఆధార్‌ కార్డు (Aadhaar Card) పై ఇంటి అడ్రస్‌ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు తెలుసుకుందాం.
 

1 /5

మన దేశంలో ఆధార్‌ కార్డు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ఇది గుర్తింపు కార్డు. బ్యాంకింగ్‌ సేవలతోపాటు చదువు, ఉద్యోగం ఇతర అన్ని పనులకు ఒక వ్యక్తి ఆధార్‌ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి.  

2 /5

ఈ ఆధార్‌ కార్డు యూఐడీఏఐ 12 అంకెలతో అందిస్తుంది. ఆధార్‌ కార్డుపై పేరు, ఇంటి అడ్రస్‌, మొబైల్‌ నంబర్‌ మార్చుకునే సదుపాయం ఉంటుంది. అయితే, ఈరోజు ఆధార్‌ కార్డుపై ఎన్నిసార్లు అడ్రస్‌ మార్చుకోవచ్చు తెలుసుకుందాం.  

3 /5

సొంత ఇల్లు ఉంటే వేరు కాని అద్దె ఇంట్లో ఉన్నా.. ఇల్లు మారినా ఆధార్‌ కార్డుపై అడ్రస్‌ మార్చుకోవాల్సి వస్తుంది. ఆధార్‌ కార్డుపై ఇంటి అడ్రస్‌ ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చు. లేదా దగ్గరలో ఉన్న ఆధార్‌ సెంటర్‌లలో కూడా అప్డేట్‌ చేసుకోవచ్చు.  

4 /5

అక్కడ బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేస్తారు ఆ తర్వార అడ్రస్ మార్పు రిక్వెస్ట్‌ ప్రక్రియ మొదలవుతుంది. ఆధార్‌ కార్డుపై అడ్రస్‌ ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. దీనికి మీ వద్ద కరెంట్‌ బిల్‌, బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌, రేషన్‌ కార్డు, పాస్‌పోర్ట్‌ ఏదో ఒకటి కలిగి ఉండాలి.  

5 /5

ఆధార్‌ కార్డుపై అడ్రస్‌ సులభంగా మార్చుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్రస్‌ మార్పు రిక్వెస్ట్‌ చేయాలి. ఆ తర్వాత సంబంధిత డాక్యుమెంట్లు కూడా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. దీనికి నామమాత్రపు ఛార్జీ రూ.50 వసూలు చేస్తారు. ఓ 15 రోజులు తర్వాత అడ్రస్‌ అప్డేట్‌ అవుతుంది.