2025 Rasi Phalalu: విశ్వావసు నామ సంవత్సరం.. 12 రాశుల వారి ఆదాయం, వ్యయం, రాజ్య పూజం, అవమానం.. వివరాలు ఇవే

2025 Rasi Phalalu: తెలుగు రాష్ట్రాల్లో విశ్వసనీయమైన జ్యోతిష్యుడు వేణు స్వామి 2025 విశ్వావసు నామ సంవత్సర రాశి ఫలాలను వివరించారు. ఈ వివరాలను ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన చెప్పిన ప్రకారం ప్రతి రాశి వారికి వచ్చే సంవత్సరం ఎలా ఉందో ఒకసారి చూద్దాం..

1 /13

ఆదాయం: 2 | వ్యయం: 14 | రాజపూజ్యం: 5 | అవమానం: 7   ఈ ఏడాది కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. ఏలినాటి శని ప్రభావం ప్రారంభం అవుతుంది. తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం. విద్యార్థులకు విదేశీ యానం అనుకూలం. ఉద్యోగులు బదిలీ ఎదుర్కొనే అవకాశం. రైతులకు మంచి దిగుబడి ఉంటుంది, కానీ పన్నుల సమస్యలు ఉండొచ్చు.   దోష నివారణ: నల్ల రంగు దుస్తులు తొలగించి బ్లూ కలర్ దుస్తులు ధరించాలి. తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో పూజ చేయించుకోవడం మంచిది.  

2 /13

ఆదాయం: 11 | వ్యయం: 5 | రాజపూజ్యం: 1 | అవమానం: 3   రాహు, కేతు ప్రభావం తీవ్రంగానే ఉన్నప్పటికీ శని సానుకూలత వల్ల.. విజయవంతమైన ఫలితాలు ఉంటాయి. కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. వ్యాపారవేత్తలకు విపరీతమైన లాభాలు. న్యాయవాదులు, పోలీసులకు ప్రమోషన్లు వస్తాయి.  

3 /13

ఆదాయం: 14 | వ్యయం: 2 | రాజపూజ్యం: 3 | అవమానం: 3   ఈ ఏడాది రాశి వారికి రాజయోగం ఉంది. రాజకీయ నాయకులు, వ్యాపారస్తులకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు విశేష అవకాశాలు.  

4 /13

ఆదాయం: 8 | వ్యయం: 2 | రాజపూజ్యం: 7 | అవమానం: 3   ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశముంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. న్యాయ వ్యవహారాలు లాభంగా ఉంటాయి. రైతులకు ఆశాజనకమైన ఫలితాలు కనిపిస్తాయి.   దోష నివారణ: పసుపు దుస్తులు ధరించడం ద్వారా సమస్యలు తొలగిపోతాయి.  

5 /13

ఆదాయం: 11 | వ్యయం: 11 | రాజపూజ్యం: 3 | అవమానం: 6   అష్టమ శని ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి. ఆదాయం ఎక్కువగానే ఉన్నా ఖర్చులు అధికంగా ఉంటాయి. సినీరంగం, రాజకీయాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు.  

6 /13

ఆదాయం: 14 | వ్యయం: 2 | రాజపూజ్యం: 6 | అవమానం: 6   అన్ని రంగాల్లో విజయం సాధించే ఏడాది. ఉద్యోగుల్లో ప్రమోషన్లు కనిపిస్తాయి. పెళ్లి కాని యువతులకు వివాహ యోగం.   దోష నివారణ: పూజలు అవసరం లేదు.  

7 /13

ఆదాయం: 11 | వ్యయం: 8 | రాజపూజ్యం: 2 | అవమానం: 2   సమస్యాత్మకమైన ఏడాది అయినప్పటికీ 98% అనుకూలత. రాజకీయాల్లో ఉన్నవారికి అనుకోని పరిణామాలు.   దోష నివారణ: గురువారం పసుపు దుస్తులు ధరించడం శుభం. 

8 /13

ఆదాయం: 2 | వ్యయం: 14 | రాజపూజ్యం: 5 | అవమానం: 2   శత్రువులు, ఇతర సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు. సినీ, రాజకీయ రంగాల్లో కొత్త అవకాశాలు.   దోష నివారణ: పూజలు అవసరం లేదు.    

9 /13

ఆదాయం: 8 | వ్యయం: 14 | రాజపూజ్యం: 1 | అవమానం: 2   చెడు వ్యయాలు అధికం. ఆరోగ్య సమస్యలు. విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి. వివాహ సంబంధాలు అనుకూలిస్తాయి.   దోష నివారణ: పసుపు రంగు దుస్తులు ధరించడం.  

10 /13

ఆదాయం: 14 | వ్యయం: 2 | రాజపూజ్యం: 4 | అవమానం: 3   ఆర్ధిక లాభాలు. విద్యార్థులకు అవకాశాలు. ఉద్యోగాల్లో ఎదుగుదల. వ్యాపారంలో లాభాలు.   దోష నివారణ: నల్ల రంగు దుస్తులు తొలగించి నీలం ధరించడం.    

11 /13

ఆదాయం: 11 | వ్యయం: 8 | రాజపూజ్యం: 7 | అవమానం: 4   ఆర్థిక పరమైన సమస్యలు అధిగమిస్తారు. కుటుంబ బంధాలు మెరుగ్గా ఉంటాయి. కొత్త వ్యాపారాల్లో అవకాశాలు.   దోష నివారణ: శనివారం పూజ చేయడం మంచిది.

12 /13

ఆదాయం: 8 | వ్యయం: 2 | రాజపూజ్యం: 6 | అవమానం: 5   ఆర్థికంగా చక్కదిద్దుకోవచ్చు. వివాహ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. విద్యార్థులకు సానుకూల ఫలితాలు.   దోష నివారణ: పసుపు దుస్తులు ధరించాలి.

13 /13

పైన చెప్పిన వివరాలు పంచాంగం, జ్యోతిష్కుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.