Surya Budh Yuti will make Budhaditya Rajyog in Aries 2023: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, రీసెంట్ గా బుధుడు తన రాశిని మార్చి మేషరాశిలోకి ప్రవేశించాడు. మరో నాలుగు రోజుల్లో అంటే ఏప్రిల్ 14న సూర్యభగవానుడు కూడా అదే రాశిలోకి ఎంటర్ అవ్వనున్నాడు. మేష రాశిలో బుధ, సూర్య గ్రహాల కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈ పవిత్రమైన యోగం కారణంగా 5 రాశులవారు జాతకాలు మారిపోనున్నాయి. బుధుడు మరియు సూర్యుడు సంయోగం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
బుధాదిత్య రాజయోగం ఈ రాశులకు వరం
ధనస్సు రాశి: ధనస్సు రాశి యెుక్క ఐదో ఇంట్లోకి బుధుడు ప్రవేశిస్తాడు. మీరు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. మీకు ధనలాభం ఉంటుంది. విద్యార్థులకు చదువులో రాణిస్తారు. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. అనుకున్న సమయానికి మీ పనులన్నీ పూర్తవుతాయి.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి బుధాదిత్య రాజయోగం అనుకూలంగా ఉంటుంది. మీరు వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. డబ్బు సమయానికి అందుతుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. జాబ్ చేసేవారికి పదోన్నతి లభించే అవకాశం ఉంది.
మేష రాశి: సూర్యుడు, బుధుడు కలయిక వల్ల ఏర్పడిన బుధాదిత్య రాజయోగం మేషరాశి యెుక్క లగ్న గృహంలో ఏర్పడుతుంది. దీని కారణంగా మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. వివాహం కాని వారికి పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది.
Also Read: Guru Gochar 2023: మరో 12 రోజుల్లో ఈ 4 రాశుల సుడి తిరగబోతుంది.. ఇందులో మీ రాశి ఉందా?
మిథున రాశి : ఈ రాశి యెుక్క 11వ ఇంట్లోకి బుధుడు ప్రవేశిస్తాడు. దీంతో మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. డబ్బును ఆదా చేస్తారు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు భూమి లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది.
సింహ రాశి: సింహరాశి యెుక్క అదృష్ట స్థానంలో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీంతో మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీ ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు లాభపడతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి