Karnataka Elections 2023: దేశంలో సాధారణ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు కర్ణాటక ఎన్నికల బెల్ మోగింది. రాష్ట్రంలోని 224 నియోజకవర్గాల ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విడుదల చేసింది. మే 10న జరగనున్న ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఏప్రిల్ 13 విడుదల కానుంది.
దేశం మొత్తం దృష్టి ఇప్పుడు కర్ణాటక ఎన్నికలపై పడింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 224 నియోజకవర్గాల పోలింగ్ ఒకే విడతలో నిర్వహించనున్నారు. దాంతోపాటు ఈసారి తొలిసారిగా 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు ఓట్ ఫ్రం హోం సౌకర్యం కల్పించబోతున్నారు. రాష్ట్రంలో మొత్తం 5.21 కోట్లమంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష, మహిళా ఓటర్ల సంఖ్య దాదాపుగా సమానం. 80 ఏళ్ల వయస్సు దాటిన వృద్ధులు, దివ్యాంగులు మొత్తం 12.15 లక్షలమంది ఉన్నారు. వీరందరికీ తొలిసారిగా ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నారు. గిరిజన ఓటర్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
224 నియోజకవర్గాలున్న కర్ణాటక అసెంబ్లీలో 36 ఎస్కీ, 15 ఎస్టీ కాగా 173 జనరల్ స్థానాలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 58,282 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఏప్రిల్ 13న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. మే 10వ తేదీన పోలింగ్ ఉంటే, 13వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎలక్షన్ కోడ్ మాత్రం తక్షణం ఇవాళ్టి నుంచి అమల్లోకి రానుంది.
ఎన్నికల షెడ్యూల్ ఇలా
ఏప్రిల్ 13న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఏప్రిల్ 20 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ
ఏప్రిల్ 21 న నామినేషన్ల పరిశీలన
ఏప్రిల్ 24న నామినేషన్ల ఉపసంహరణ
మే 10న పోలింగ్
మే13న ఓట్ల లెక్కింపు
గతంలో అంటే 2018లో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో వాస్తవానికి జేడీఎస్, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. కానీ కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చడం ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈసారి పూర్తిగా ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తుంటే..తిరిగి తమ చేతుల్లోకి తెచ్చుకోవాలని కాంగ్రెస్ సిద్ధమౌతోంది.
Also read: Amritpal Singh CCTV Footage: ఢిల్లీలో సీసీటీవీ కెమెరాలకు చిక్కిన అమృత్ పాల్ సింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook