Trivikram Night Shoot for SSMB 28 మహేష్ బాబు త్రివిక్రమ్ పూజా హెగ్డే శ్రీలీల అంతా కూడా సినిమా కోసం తెగ కష్టపడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమా ప్రారంభమే ఆలస్యంగా జరిగింది. అందుకే సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలో గందరగోళం ఏర్పడింది. ఆ మధ్య నిర్మాత నాగవంశీ అయితే సినిమాను ఆగస్ట్ 11న రిలీజ్ చేస్తామని ప్రకటించాడు.
కానీ అదే డేట్‌కు చిరంజీవి భోళా శంకర్ సినిమా వస్తోంది. ఈ మేరకు ఆ సినిమా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఆ సినిమా కన్ఫామ్ అవ్వడంతో.. మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా రిలీజ్ డేట్ మీద గందరగోళం నెలకొంది. ఉగాది నాడు సినిమా అప్డేట్ వస్తుందని అనుకున్నారు. కానీ ఆ అప్డేట్ను శ్రీరామనవమికి పోస్ట్ పోన్ చేసినట్టుగా తెలుస్తోంది. సినిమా టైటిల్ విషయంలో ఇంకా సందిగ్దత వీడలేదు.
అయోధ్యలో అర్జునుడు అనే టైటిల్‌తో పాటు ఇంకా మూడు నాలుగు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట. కానీ ఏ టైటిల్ అనేది ఇంకా ఫిక్స్ కాలేదు. శ్రీరామనవమి వరకు ఏదో ఒక టైటిల్ ఫిక్స్ అయి ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ మూవీ షూటింగ్‌లను రాత్రి పూట చేస్తారట. నైట్ సీన్లకు సంబంధించిన షూటింగ్ ఉందని, అందుకే ఓ వారం రోజుల పాటు రాత్రి పూట షూటింగ్ చేయబోతోన్నట్టుగా తెలుస్తోంది. ఈ షెడ్యూల్ కోసం భారీ సెట్‌ను కూడా వేశారని టాక్.
తాజాగా పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను చూస్తే.. మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా ఆగస్ట్‌లో వచ్చే చాన్స్ కనిపించడం లేదు. ఈ సినిమా దసరాకు గానీ, వచ్చే ఏడాది సంక్రాంతికి గానీ రిలీజ్ చేసేలా ఉన్నారు.
Also Read: Manchu Family Fighting : మంచు బ్రదర్స్ వివాదం.. రంగంలోకి మోహన్ బాబు?.. వెనక్కి తగ్గిన మనోజ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook