Kidney Health: శరీరానికి ఇంత ముఖ్యమైన కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి సంరక్షణ తీసుకోవాలనేది తెలుసుకుందాం. కిడ్నీల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఏం చేయాలో పరిశీలిద్దాం. ఎందుకంటే కొన్ని సూచనలు పాటిస్తే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా కిడ్నీ సంబంధిత వ్యాధులు ఎదుర్కోవల్సి వస్తుంది. కిడ్నీలు దెబ్బతింటే వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అందుకే కిడ్నీలను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. కొన్ని సూచనల్ని పాటిస్తే కిడ్నీలను ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు.
మందులకు దూరం
కొంతమంది ప్రతి చిన్న సమస్యకు మందులు వాడుతుంటారు. ఇది మంచి అలవాటు కానే కాదు. మందుల వల్ల కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఎందుకంటే వివిధ రకాల మందులు కిడ్నీలకు హాని చేకూరుస్తాయి. అందుకే వైద్యుడి సలహా లేకుండా చిన్న చిన్న సమస్యలకు మందుల వాడటం ఆపేయాలి.
హెల్తీ ఫుడ్స్
కిడ్నీలు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలంటే డైట్లో ఆరోగ్యకరమైన పదార్ధాలు ఉండేట్టు చూసుకోవాలి. దీనివల్ల అధిక రక్తపోటు, స్థూలకాయం, డయాబెటిస్ వంటి సమస్యలు ఉత్పన్నం కావు. డైట్లో కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు ఉంటే మంచిది.
పుష్కలంగా నీళ్లు తాగడం
పుష్కలంగా రోజుకు కావల్సినంత నీరు తాగడం వల్ల కిడ్నీలు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీల పనితీరు మెరుగుపడాలంటే రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాల్సిందే. దీనివల్ల శరీరంలో ఉండే టాక్సిన్స్ బయటకు వచ్చేస్తాయి. కిడ్నీలో రాళ్లు, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తొలగిపోతాయి.
మత్తు పదార్ధాలకు దూరం
స్మోకింగ్ వల్ల కిడ్నీలు పాడవుతాయి. అటు ఆల్కహాల్ కూడా కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ రెండు అలవాట్లుంటే కిడ్నీల పనితీరు సరిగ్గా ఉండదు. కిడ్నీల్లో ఏ విదమైన సమస్య తలెత్తకుండా ఉండాలంటే..స్మోకింగ్, మద్యం రెండూ మానేయాలి.
వ్యాయామం
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు రోజుకు కనీసం 30 నిమిషాలు వాకింగ్ లేదా వ్యాయామం అవసరం. దీనివల్ల డయాబెటిస్, గుండె వ్యాధులు దూరమౌతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook