Surya Grahan 2023 Horoscope: ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 20న ఏర్పడనుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహణం సమయంలో సూర్యుడు మేషరాశిలో కూర్చుంటాడు. మేష రాశికి అధిపతి అంగారకుడు. ఈ సంవత్సరం ఏర్పడబోయే మొదటి గ్రహణం ఖగ్రాస్ సూర్యగ్రహణం అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలో కనిపించదు. కానీ దీని ప్రభావం ప్రజలందరిపై సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. సూర్యగ్రహణం కారణంగా ఏ రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం.
సూర్యగ్రహణం ఈ రాశులకు వరం
వృషభం
ఈ రాశి వారికి సూర్యగ్రహణం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి. సూర్యుడు మేషరాశిలో ఉండటం వల్ల శారీరక, మానసిక, ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆదాయానికి సంబంధించిన కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఆఫీసులో మీ పని ప్రశంసించబడుతుంది.
మిధునరాశి
సూర్యగ్రహణం మిథునరాశి వారికి చాలా మేలు చేస్తుంది. ఆగిపోయిన పనులు మెుదలవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యాపారంలో భారీగా లాభం ఉంటుంది. బిజినెస్ లో పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి తరుణం.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి సూర్యగ్రహణం సంతోషాన్ని ఇస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో లాభం ఉంటుంది. కెరీర్ దూసుకుపోతుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కుటుంబంతో సరదాగా గడుపుతారు. మెుత్తానికి ఈ సమయం కలిసి వస్తుంది.
Also Read; Mangal Gochar 2023: రాబోయే 2 నెలలపాటు వీరి జీవితం అల్లకల్లోలం.. ఇందులో మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook