Rs 1 Lakh Discounts and Offers on Mahindra Thar 2023 Still February 28: భారతదేశంలోని ప్రముఖ లైఫ్‌స్టైల్ ఆఫ్-రోడర్ ఎస్‌యూవీగా 'మహీంద్రా థార్' ప్రసిద్ధి చెందింది. ఇటీవల మహీంద్రా కంపెనీ థార్ యొక్క ఆర్‌డబ్ల్యూడీ (RWD) వెర్షన్‌ను పరిచయం చేసింది. ఆర్‌డబ్ల్యూడీ వెర్షన్ ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇప్పుడు మీరు ఈ ఎస్‌యూవీని 10 లక్షల కంటే తక్కువకు కొనుగోలు చేయవచ్చు. ఇక 4X4 వేరియంట్ ధర ఎక్కువగా ఉంటుంది. దీని ధర రూ.13.59 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే మీరు ఈఎస్‌యూవీని భారీ తగ్గింపుతో కొనుగోలు చేసే అవకాశం ఉంది. కంపెనీ ప్రస్తుతం థార్ యొక్క 4డబ్ల్యూడీ వెర్షన్‌పై రూ. 1 లక్ష వరకు తగ్గింపును అందిస్తోంది.
వాస్తవానికి ఈ 1 లక్ష తగ్గింపులో రూ. 10,000 కార్పొరేట్ బోనస్, రూ. 15,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌తో పాటు రూ. 45,000 వరకు నగదు తగ్గింపు ఉంటుంది. లేదా రూ. 60,000 యాక్సెసరీస్ ప్యాక్ ప్రయోజనం పొందవచ్చు. ఇది కాకుండా కంపెనీ బీమా ప్రయోజనాలను మరియు మూడేళ్ల నిర్వహణ ప్యాకేజీని అందిస్తోంది. అయితే ఈ ఆఫర్‌లు MY2022 (2022లో తయారు చేయబడే) LX పెట్రోల్ AT 4WD వేరియంట్‌పై మాత్రమే వర్తిస్తాయి. ఈ కారు ధర ప్రస్తుతం రూ. 15.82 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
మహీంద్రా థార్‌కు ప్రస్తుతం భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. RWD వెర్షన్ కోసం వెయిటింగ్ పీరియడ్ ఇప్పుడు 18 నెలలుగా ఉంది. 4WD వెర్షన్ కోసం నాలుగు నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. జనవరి 2023 వరకు థార్ పెండింగ్ ఆర్డర్లు 37,000 యూనిట్లుగా ఉన్నాయి. థార్ యొక్క చౌకైన వేరియంట్ 1.5 లీటర్ డీజిల్ వేరియంట్‌కు డిమాండ్ బాగా ఉంది. ఇందులో ఇంజన్ వెనుక వీల్ డ్రైవ్ వేరియంట్‌లో అందించబడుతుంది. ఈ ఇంజన్ 118PS పవర్ మరియు 300Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మాత్రమే ఇవ్వబడింది.
Also Read: MS Dhoni: ఎంఎస్ ధోనీ కెరీర్ చివరి దశకు చేరుకుంది.. సాయం చేయడానికి సిద్ధం: మ్యాథ్యూ హేడెన్
Also Read: New Working Rule: సూపర్ న్యూస్.. వారానికి నాలుగు రోజులే పని.. మూడు వీక్‌ఆఫ్‌లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.