9 Number is Unlucky for Taraka Ratna: మామూలుగా అందరూ తొమ్మిది అంకెను చాలా లక్కీ అని భావిస్తూ ఉంటారు. తొమ్మిది కలిసి వచ్చేలా కార్ నెంబర్లు, ఫోన్ నెంబర్లు వేసుకుని మరీ ముందుకు వెళుతూ ఉంటారు. కానీ ఆ తొమ్మిది నెంబర్ తారకరత్నకు మాత్రం కలిసి రాలేదని అంటున్నారు. తారకరత్న ముందుగా ఒకటో నెంబర్ కుర్రాడు అనే సినిమాతో 2002లో హీరోగా లాంచ్ అయ్యాడు. ఆయన ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆయనకు వరుస అవకాశాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే ఒకేరోజు 9 వేరు వేరు సినిమాలను ప్రారంభించిన ఏకైక సినీ హీరోగా ఆయన పేరిట ఒక ప్రపంచ రికార్డు కూడా ఉంది. అయితే ఈ నెంబర్ ఆయనకు కలిసి రాకపోవడంతో అందులో కేవలం మూడే సినిమాలు సెట్స్ మీదకు వెళ్లి షూటింగ్ జరుపుకున్నాయి. సుమారు ఆరు సినిమాల షూటింగ్స్ కూడా జరగలేదంటే విషయం అర్థం చేసుకోవచ్చు. ఇక ఆయన నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న సమయంలో ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సరిగ్గా అది జనవరి 27వ తారీకు అంటే ఆ రెండు అంకెలను కలిపితే తొమ్మిదవ నెంబర్. ఇక ఆయన మరణించిన తేదీ ఫిబ్రవరి 18, ఆ రెండు అంకెలను కలిపినా చివరికి తొమ్మిదే వస్తోంది
అలా తారకరత్న కెరియర్లో 9వ నెంబర్ అసలు ఏ మాత్రం కలిసి రాలేదని అంటున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన వెబ్ సిరీస్ పేరు నైన్ అవర్స్. దాని తర్వాత ఆయన మరో ఓటీటీ ప్రాజెక్టు కూడా చేయలేదు. అలా తారకరత్నకు ఈ 9 నెంబర్ ఏ మాత్రం కలిసి రాలేదని అంటున్నారు కొందరు.
అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తొమ్మిది నెంబర్ కి చాలా ప్రత్యేకత ఇస్తూ ఉంటారు. ఆయన కారు నెంబర్లు అన్నీ తొమ్మిదిలే ఉంటాయి. నాలుగు తొమ్మిదులు కార్ నెంబర్ కోసం ఎంత వెచ్చించడానికి అయినా జూనియర్ ఎన్టీఆర్ వెనుకాడరు. అయితే అదే కుటుంబానికి చెందిన తారకరత్నకు మాత్రం తొమ్మిదవ నెంబర్ కలిసి రాలేదని అంటున్నారు. వలన అయితే ఇదంతా కేవలం ట్రావెల్స్ ని కొంతమంది కొట్టి పారేస్తున్నా, న్యూమరాలజీ ప్రకారం కూడా కొన్ని నమ్మాల్సి వస్తుందని మరికొందరు అంటున్నారు. ఇక ఈ విషయంలో మీ ఉద్దేశం ఏమిటో కింద కామెంట్ చేయండి.
Also Read: Taraka Ratna Last Movie: తారకరత్న నటించిన చివరి సినిమా.. పాత్రేమిటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook