CM KCR Birthday: సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకల్లో అపశ్రుతి.. కిందపడిపోయిన ఎమ్మెల్యే

MLA Kaleru Venkatesh: సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో గందరగోళం నెలకొంది. కాచిగూడ నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అసలు ఏం జరిగిందంటే..?

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 17, 2023, 04:33 PM IST
CM KCR Birthday: సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకల్లో అపశ్రుతి.. కిందపడిపోయిన ఎమ్మెల్యే

MLA Kaleru Venkatesh: తెలంగాణ సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నేతలు కేక్ కట్ చేసి.. తమ అధినేతకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. పలు చోట్ల అన్నదాన కార్యాక్రమాలు, సేవా కార్యాక్రమాలు, సీఎం చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని కాచిగూడలో నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.

కాచిగూడలో నిర్వహించిన కేసీఆర్ బర్త్ డే వేడుకలకు ఎమ్మెల్యే కాలేరు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారీగా టపాసులు పేల్చారు. ఈ క్రమంలో నిప్పు రవ్వలు ఎగిరి గ్యాస్ బెలూన్లపై పడడంతో అవి పేలిపోయాయి. భారీగా శబ్దం రావడంతో అందరూ భయంతో ఒక్కసారిగా పరుగు అందుకోగా.. ఎమ్మెల్యే కాలేరు కూడా పరిగెత్తుతూ కిందపడిపోయారు. ఎమ్మెల్యేతో పాటు కార్యకర్తలు కూడా కిందపడ్డారు.

ఈ ఘటనలో ఎమ్మెల్యే కాలేరు, కార్యకర్తలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తృటిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎంతో సంతోషంగా జరగాల్సిన ముఖ్యమంత్రి వేడుకలు.. ఇలా అనుకోకుండా జరిగిన ఘటనతో గందరగోళంగా మారాయి.

సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఆనందం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా బ్యానర్లు ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్‌పై తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఫ్లెక్సీలతో గులాబీమయంగా మార్చేశారు. కేక్‌లు కట్ చేస్తూ.. టపాసులు కాల్చుతూ సంబరంగా జరుపుకుంటున్నారు.

Also Read: Chetan Sharma Sting Operation: జస్ప్రీత్ బుమ్రా గురించి సంచలనం విషయం బయటపెట్టిన టీమిండియా చీఫ్ సెలక్టర్!

Also Read: Interest Free Loan: ఈ రాష్ట్ర రైతులకు గుడ్‌న్యూస్.. రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News