జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ 2023లో మళ్లీ పాత నిబంధనలు వచ్చి చేరాయి. ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజ్ మళ్లీ ప్రవేశపెట్టింది. ఇంటర్‌లో 75 శాతం మార్కులుంటేనే జేఈఈ మెయిన్స్ పరీక్షకు అర్హత ఉంటుందని వెల్లడించింది ఎన్‌టీఏ. ఎన్ఐటీ, ఐఐఐటీ, సీఎఫ్‌ఐటీ సంస్థల్లో ప్రవేశానికి ఇంటర్మీడియట్ పరీక్షలో 75 శాతం మార్కులుండటమే కాకుండా ప్రతి సబ్జెక్టులో నిర్ణీత అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.
ఇతర నిబంధనలు
ఇవి కాకుండా మరికొన్ని నిబంధనలు విధించింది. రెండు సెషన్లలో జరగనున్న పరీక్షకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక సెషన్‌కు ఒక దరఖాస్తే ఉండాలి. ఒకటికి మించి దరఖాస్తులున్నట్టు తరువాత ఎప్పుడు గుర్తించినా..అభ్యర్ధిపై చర్యలు తప్పవు. తొలి సెషన్ పరీక్ష జనవరి 24 నుంచి 31 వరకు జరగనుండగా..రెండవ సెషన్ పరీక్ష ఏప్రిల్ 6 నుంచి 12 వరకూ జరుగుతాయి. మెయిన్ పరీక్షకు ఈసారి వయోపరిమితి ఉండదు. అయితే అడ్మిషన్ సమయంలో విద్యాసంస్థలు నిర్ణయించే వయో పరిమితి పాటించాల్సిందేనని ఎన్టీఏ తెలిపింది.
ఈసారి దేశవ్యాప్తంగా పరీక్ష కేంద్రాలు తగ్గాయి. గత ఏడాది కరోనా సమయంలో 514 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తే..ఈసారి 399కు కుదించారు. రిజిస్ట్రేషన్ ఫీజు పెరిగింది. జనరల్ కేటగరీ విద్యార్ధుల ఫీజు 650 నుంచి 1000 రూపాయలు కాగా మహిళలకు 800గా ఉంది. ఎస్టీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు 325 నుంచి 500 రూపాయలైంది. ఇతర దేశాల అభ్యర్ధుల ఫీజు 3 వేల నుంచి 5 వేలుగా కాగా మహిళలకు 1500 నుంచి 3 వేలు చేశారు.
జేఈఈ మెయిన్స్ ఆన్‌లైన్ దరఖాస్తులో తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఈ మెయిల్, మొబైల్ నెంబర్లు తప్పనిసరి. ఏదైనా పరిస్థితుల వల్ల పరీక్ష వాయిదా వేయాల్సి వస్తే..ఇతర పరీక్షలకు ఇబ్బంది లేకుండా రిజర్వ్ తేదీలు ముందుగానే ప్రకటించింది ఎన్టీఏ. దీని ప్రకారం తొలి విడత పరీక్షలకు ఫిబ్రవరి 1, 2, 3 తేదీలుంటే..రెండవ విడతకు ఏప్రిల్ 13, 15 తేదీలున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook