Lucky Zodiac Signs November 2022: చాలా మందిని మనం చూస్తూ ఉంటాం.. వారు ఏ పని చేసిన విజయాలు సాధిస్తారు. దీనికి ప్రధాన కారణాలు వారికి రాశి చక్రాలు రాజయోగ దశలో ఉండడం. రాశులు ఫలప్రదంగా ఉండే వ్యక్తి జీవితంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వ్యాపారాలు ప్రారంభించిన మంచి లాభాలు కూడా పొందుతారు. అంతేకాకుండా వీరికి సమాజంలో మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. అయితే ఏ రాశుల వారు డబ్బు సంపాదనలో అగ్రగామిగా ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశువారికి ధనమే.. ధనం:
మేషం:
మేష రాశికి అధిపతి కుజుడుగా వ్యవహరిస్తాడు. అయితే ఈ క్రమంలో వ్యక్తులు ధైర్యంగా ఉంటారు. అంతేకాకుండా ఈ రాశువారు డబ్బు సంపాదన లక్ష్యంగా పని చేస్తారు. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉంటారు. ఈ రాశి వారు ధనవంతులైన తర్వాత మాత్రమే చనిపోతారని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో మేష రాశి వారికి కష్టాలన్ని తొలగిపోతాయి.
వృషభం:
వృషభ రాశికి అధిపతి శుక్రుడుగా వ్యవహరించడం వల్ల ఈ రాశి వారు సంపద-విలాసం, అందం, కీర్తి, ప్రేమ పొందుతారు. ఈ రాశి వారికి విలాసవంతమైన జీవితాన్ని గడపాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. కెరీర్‌ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు చాలా కష్టపడతారు. అయితే కష్టపడితే వీరు అపారమైన సంపదకు యజమానులుగా మారతారు.
మిథునం:
మిథున రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. దీని కారణంగా ఈ రాశి వారు తెలివితేటలు, కమ్యూనికేషన్ ప్రదర్శిస్తూ ఉంటారు. అంతేకాకుండా వీరు వ్యాపారాల్లో మంచి లాభాలు కూడా పొందే అవకాశాలున్నాయి. కాబట్టి కొన్ని విషయాల్లో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వీరు ఎలాంటి పనులు చేసిన లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థికపరంగా బలపడుతారు.
మకరరాశి:
మకరరాశి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే స్ఫూర్తిని శనిదేవుడు అనుగ్రహం వల్ల లభిస్తుంది. వీరిలో కొంత మంది నిరుపేద కుటుంబంలో జన్మించిన వారుంటారు. వీరు ఈ క్రమంలో ఎదగడానికి ప్రయత్నిస్తారు. అంతేకాకుండా కొత్త ఆలోచనలతో డబ్బులు సంపాదించేందుకు ప్రయత్నాస్తారు. ఈ రాశి వారు కొంత కష్ట పడి పని చేస్తే.. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుతారు.
కుంభం:
కుంభ రాశికి శని అధిపతి వ్యవహరిస్తాడు. దీంతో ఈ రాశి వారు సమాజంలో మంచి ఇమేజ్ కలిగి ఉంటారు. కుంభ రాశి వారు తీసుకునే నిర్ణయాలన్ని ఖచ్చితమైనవిగా ఉంటాయి. కాబట్టి వీరు ఏం ఆలోచించిన మంచి కోసమేనని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరు డబ్బులను సంపాదించేందుకు కొత్త మార్గాలను అనుసరిస్తారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Post Office Scheme: ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టండి.. భారీ లాభం పొందండి
Also Read: Prince OTT: 'ప్రిన్స్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి