Shah Rukh Khan Twitter : ఫ్యామిలీతో కలిసి ఆ పని చేయడట.. అభిమానులకు షారుఖ్ స్వీట్ రిప్లైలు

Shah Rukh Khan Twitter Session బాలీవుడ్ బాద్ షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తాజాగా ట్విట్టర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ పెట్టాడు. ఆస్క్ ఎస్‌ఆర్‌కే అంటూ సెషన్ రన్ చేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 5, 2022, 03:02 PM IST
  • నెట్టింట్లో షారుఖ్ ఖాన్ సందడి
  • ఫ్యాన్స్‌తో బాద్ షా చిట్ చాట్
  • పర్సనల్ విషయాలపై కింగ్ ఖాన్ రియాక్షన్
Shah Rukh Khan Twitter : ఫ్యామిలీతో కలిసి ఆ పని చేయడట.. అభిమానులకు షారుఖ్ స్వీట్ రిప్లైలు

Shah Rukh Khan Twitter Session : బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ప్రస్తుతం పఠాన్ సినిమాతో ట్రెండ్ అవుతున్నాడు. చాలా ఏళ్ల తరువాత షారుఖ్ ఖాన్ వరుసగా సినిమాలు లైన్లో పెట్టాడు. ఇప్పుడు షారుఖ్ పఠాన్ టీజర్ అందరినీ ఆకట్టుకుంది. రాజ్ కుమార్ హిరాణీతో చేస్తోన్న డుంకీ సినిమా మీద కూడా అంచనాలున్నాయి. అట్లీ జవాన్ మీద ఇప్పుడు ఓ కాంట్రవర్సీ నడుస్తోంది. ఇలా షారుఖ్‌ సినిమాల సందడి గట్టిగానే ఉంది. తాజాగా షారుఖ్ తన అభిమానులతో ముచ్చట్లు పెట్టాడు. #ASKSRK అంటూ షారుఖ్ ట్విట్టర్‌లో సందడి చేశాడు.

మీరెందుకు ఇంత హాట్‌గా ఉన్నారు? అని అడిగితే.. సాస్, చికెన్ తింటానని అలా ఉంటానేమో అని చెప్పుకొచ్చాడు. సిద్దార్థ్ ఆనంద్ గురించి చెప్పండని అంటే.. అతను చాలా కష్టపడుతుంటాడు.. ఎంతో సరదాగా ఉంటాడు అని అన్నాడు. చాలా గ్యాప్ తరువాత వస్తున్నారు కదా? ఎలా ఉందని ఓ నెటిజన్ అడిగితే.. మళ్లీ తిరిగి ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. దీపికతో పని చేయడం ఎలా అనిపించింది? అని ఇంకో నెటిజన్ అడిగాడు. ఆమె అద్భుతమైన నటి, స్టార్ అనేది పక్కన పెడితే.. ఆమె ఈ పఠాన్ మీద క్రియేట్ చేసిన ప్రభావం అద్భుతంగా ఉంటుందని అన్నాడు.

 

మీ పఠాన్ సినిమాను నా గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి చూస్తాను లేదంటే ఆమెకు ఇంకొకరితో పెళ్లి జరిగే ప్రమాదం ఉంది అని ఓ నెటిజన్ ఫన్నీగా కామెంట్ పెడతాడు. అయ్యో సారీ అయ్యా.. నా సినిమాను ఒంటరిగా చూసినా కూడా బాగానే ఉంటుంది.. డోంట్ వర్రీ అంటూ షారుఖ్‌ ట్వీట్ వేశాడు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీలో మీరు మాట్లాడుకుంటారా? అని ఓ నెటిజన్ అడిగితే.. లేదు లేదు.. నేను అసలు అంత ఒంటరిగా ఉండను అని సమాధానం ఇచ్చాడు.

 

మీరు, మీ ఫ్యామిలీ అంతా కూడా కర్దాషియన్ లాంటి షో పెడితే.. దానికి మీరేం పేరు ఫిక్స్ చేస్తారు? అని ఓ నెటిజన్ అడిగాడు. అలాంటిది ఎప్పుడూ నా ఫ్యామిలీతో చేయను.. నా ఫ్యామిలీ నాకు పర్సనల్.. ఒక వేళ చేస్తే కాందాన్ అనే పేరు పెడతానేమో అంటూ ఇలా షారుఖ్ తన అభిమానులతో ముచ్చట్లు పెట్టాడు. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, దళపతి విజయ్ వంటి హీరోల మీద తన ప్రేమను కురిపించాడు షారుఖ్.

Also Read : Nandamuri Balakrishna Remuneration : బాలయ్య రెమ్యూనరేషన్ మరీ అంత తక్కువా?.. చిరంజీవిని అందుకోలేనంత దూరంలో

Also Read : Jabardasth Varsha Emmanuel : పిచ్చి ముదిరింది.. స్టేజ్ మీదే వర్ష మెడలో తాళి కట్టిన ఇమాన్యుయేల్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News