Shani Amavasya 2022: ఈ ఏడాది చివరి శని అమావాస్య ఇవాళే అంటే ఆగస్టు 27న వస్తుంది. 14 సంవత్సరాల తర్వాత భాద్రపద మాసంలో శని అమావాస్య (Shani Amavasya 2022) వచ్చింది. ఈ శని అమావాస్యనే శనిశ్చరి అమావాస్య లేదా భాద్రపద అమావాస్య లేదా పిథోరి అమావాస్య లేదా కుశ అమావాస్య అని రకరకాల పేర్లుతో పిలుస్తారు. ఈ రోజున శనిదేవుడిని పూజిస్తే.. శని సాడే సతి మరియు ధైయా ప్రభావాల నుండి బయటపడతారు. అంతేకాకుండా శని దోషం, శనివక్రదృష్టి నుండి బయటపడతారు. శని అమావాస్య శుభ సమయం, పూజా విధానం గురించి తెలుసుకుందాం.
శుభ ముహూర్తం
ఈ సారి శని అమావాస్య 26 ఆగస్టు 2022న మధ్యాహ్నం 12.33 గంటలకు ప్రారంభమై.. 27 ఆగస్టు 2022 మధ్యాహ్నం 1:46 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం, శని అమావాస్య 27 ఆగస్టు 2022 న జరుపుకుంటారు. శని అమావాస్య రోజున పద్మ, శివ అనే రెండు శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ యోగంలో పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు.
పూజా విధానం
శని అమావాస్య రోజున శని దేవుడిని (ShaniDev) పూజిస్తారు. ఈ రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. దీని తరువాత, శని దేవాలయానికి వెళ్లి శని దేవుడి ముందు ఆవనూనె దీపం వెలిగించండి. దీపంలో నల్ల నువ్వులు తప్పనిసరిగా వేయాలని గుర్తుంచుకోండి. అనంతరం ఆలయంలో కూర్చుని శని చాలీసా పఠించండి. శని అమావాస్య రోజున పీపుల్ చెట్టు కింద దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం ద్వారా, శని దేవుడు సంతోషిస్తాడు. దీంతో ఆ వ్యక్తికి ఆనందం, శ్రేయస్సు మరియు అదృష్టాన్ని అనుగ్రహిస్తాడు. శనిశ్చరి అమావాస్య రోజున పూజలు చేస్తే శని సాడేసతి, ధైయా ప్రభావం చాలా వరకు తగ్గుతుందని నమ్ముతారు.
Also Read: Radha Ashtami 2022: రాధాష్టమి ఎప్పుడు? శుభ ముహూర్తం, పూజా విధానం తెలుసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook