Raisin For Weight Loss: బరువు తగ్గడం ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్య బారన పడితే.. అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, స్ట్రోక్, కరోనరీ ఆర్టరీ వంటి వ్యాధులు వస్తాయి. అయితే ఈ బరువు తగ్గించుకోవాలనుకుంటే తప్పకుండా పలు రకాల ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రతి పది మందిలో నలుగురు ఈ సమస్యలకు గురవుతున్నట్లు ఇటీవలే నివేధికలు తెలిపాయి. స్థూలకాయాన్ని తగ్గించడానికి మార్కెట్లో చాలా రకాల ఉత్పత్తులున్నాయి. కానీ వీటిని వినియోగించడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. కావున దీని కోసం ఆరోగ్య నిపుణులు పలు రకాల ఆహార నియమాలను సూచిస్తున్నారు. బరువు తగ్గడానికి ఎండుద్రాక్ష ప్రభావవంతంగా పని చేస్తాయని నిపుణులు పేర్కొన్నారు. ఎండుద్రాక్ష ఉపయోగించి బరువును ఎలా నియంత్రించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎండుద్రాక్ష ఈ పోషకాలుంటాయి:
ఎండుద్రాక్షలో ఐరన్, కాల్షియం, ఫైబర్ , యాంటీ-ఆక్సిడెంట్ల లక్షణాలు ఉంటాయి. అయితే ఈ ఎండు ద్రక్షలను తరచుగా వినియోగిస్తే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా బరువు కూడా సులభంగా తగ్గుతారు. శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచేందుకు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
వీటి ప్రయోజనాలు:
1. ఊబకాయం:
నానబెట్టిన ఎండుద్రాక్ష నీటిని తాగడం వల్ల శరీరానికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ నీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఊబకాయం వంటి సమస్యలు దూరమవుతాయి. శరీరంలోని టాక్సిన్స్ తగ్గిపోయి. పెరుగుతున్న బరువును నియంత్రిస్తుంది.
2. మలబద్ధకం:
ఎండుద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కావున పొట్ట సమస్యలకు ప్రభావవంతంగా పని చేస్తుంది. ముఖ్యంగా జీర్ణక్రియ సమస్యను తొలగించి.. బరువును నియంత్రిస్తుందని నిపుణులు పేర్కొన్నారు.
3. రోగనిరోధక శక్తి:
ఎండుద్రాక్షలో విటమిన్ సి, యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. దీని కారణంగా శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీర బలహీనత సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ నీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Naga Chaitanya: ప్రేయసితో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికేసిన నాగచైతన్య !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook