Jio vs Airtel vs Vi Prepaid Plans under Rs 200: దేశవ్యాప్తంగా నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వర్క్ ఫ్రం హోం, సాప్ట్ వేర్ జాబ్స్, డిజిటల్ మీడియా జాబ్స్ చేసేవారు ఎక్కువగా డేటాను ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలో ప్రముఖ మెుబైల్ కంపెనీలైన జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాలు రూ.200 కంటే తక్కువ ధరకే అందిస్తున్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం.
జియో రూ 200 లోపు ప్లాన్స్
రూ. 119 ప్లాన్: ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో మీరు ప్రతిరోజూ 1.5GB డేటా, అపరిమిత కాలింగ్ మరియు 300 SMS సౌకర్యం పొందవచ్చు. ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 14 రోజులు.
రూ. 149 ప్లాన్: ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో మీరు ప్రతిరోజూ 1GB డేటా, అపరిమిత కాలింగ్ మరియు 100 SMS సౌకర్యం పొందవచ్చు. ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 20 రోజులు. ఈ రూ.149 ప్లాన్‌లో మీకు అన్ని జియో యాప్‌లకు ఉచిత యాక్సెస్ కూడా ఇవ్వబడుతుంది.
రూ. 179 ప్లాన్: ఈ ఫ్లాన్ లో మీరు రోజుకు 1GB డేటా, రోజుకు 100 SMSలు, ఏదైనా నెట్‌వర్క్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్ పొందవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 24 రోజులు.
ఎయిర్‌టెల్ రూ. 200 లోపు ఫ్లాన్స్
రూ. 99 ప్రీపెయిడ్ ప్లాన్: ఈ ఎయిర్‌టెల్ ప్లాన్లో మీరు 200MB డేటాను పొందవచ్చు. దీని వాలిటిడీ 28 రోజులపాటు ఉంటుంది. ఈ ప్లాన్‌లో కాల్ కోసం మీరు సెకనుకు ఒక పైసా చొప్పున చెల్లించాలి. ఎస్ఎంఎస్ కోసం రూపాయి చెల్లించాలి.
రూ. 155 ప్రీపెయిడ్ ప్లాన్: ఈ ప్లాన్‌లో 24 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. మొత్తం 1GB డేటా వస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 300 SMSల సౌకర్యం పొందవచ్చు అలాగే ఈ ప్లాన్‌లో మీరు అమెజాన్ ప్రైమ్ వీడియోను 30-రోజులపాటు ఉచితంగా చూడవచ్చు.
రూ. 179 ప్రీపెయిడ్ ప్లాన్: ఈ ఫ్లాన్ లో మొత్తం 2GB ఇంటర్నెట్ డేటా, 300 SMS మరియు అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. అమెజాన్ ప్రైమ్ వీడియోను 30 రోజులపాటు ఉచితంగా చూడవచ్చు. వింక్ మ్యూజిక్‌కి ఉచిత యాక్సెస్ ఉంటుంది.
Vi రూ. 200 లోపు ఫ్లాన్స్
రూ. 149 ప్లాన్: అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు మొత్తం 1GB ఇంటర్నెట్ అందించబడుతుంది. ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 21 రోజులు.
రూ. 155 ప్లాన్: ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 24 రోజులు. అపరిమిత వాయిస్ కాలింగ్ , 300 ఎస్ఎంఎస్లు, 1GB డేటా అందించబడుతుంది.
రూ. 199 ప్లాన్: ఈ ప్లాన్‌లో మీరు 1GB రోజువారీ డేటా, రోజుకు 100 SMS మరియు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్ వాలిడిటీ 18 రోజులు.
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook