Kidney Damage Food: కిడ్నీ అనేది శరీరానికి అతి ముఖ్యమైన అవయవం. ఇది ఆరోగ్యంగా ఉండడం శరీరానికి చాలా ముఖ్యం. ఇవి శరీరంలో ప్రధాన క్రీయ అయిన వ్యర్థాలను తొలగించేందుకు దోహదపడుతుంది. మూత్రాన్ని ఉత్పత్తి చేయడంతో పాటు, రక్తపోటును సజావుగా నిర్వహించే హార్మోన్లను స్రవిస్తుంది. ప్రస్తుతం చాలా మందిలో ఇవి దెబ్బతింటున్నాయి. కిడ్నీని నేరుగా దెబ్బతీసే కొన్ని ఆహారపదార్థాలు ఉన్నాయని ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు అబ్రార్ ముల్తానీ అంటున్నారు. కలుషిత ఆహారం, ఆధునిక జీవన శైలి కారణంగా కిడ్నీలో కిడ్నీ ఇన్ఫెక్షన్, కిడ్నీ స్టోన్, కిడ్నీ క్యాన్సర్ మొదలైన సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
మూత్రపిండాలు శరీరంలో చేసే పనులు..!
మూత్రం ద్వారా శరీరంలోని వ్యర్థాలను తొలగించేందుకు కిడ్నీలు పని చేస్తాయి. కిడ్నీ సమస్యలు తొలిదశలో గుర్తించిన ఆహారంపై ప్రత్యేక శ్రద్ధవహించడం చాలా మంచిది. లేకపోతే తీవ్ర సమస్యగా మారే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తుంది.
మూత్రపిండాల వైఫల్యం సంకేతాలు:
- ఆకలి లేకపోవడం
- శరీరంపై వాపు
- చలి పెరగడం
- చర్మంపై దద్దుర్లు
- మూత్ర విసర్జనలో ఇబ్బంది
- చిరాకు
కిడ్నీకి హాని కలిగించేవి ఇవే..!
1. వైన్:
ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశాలున్నాయి. ఇది కిడ్నీలపై నేరుగా ప్రభావం చూపి వాటి పనితీరులో సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా మెదడుపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని నిపుణులు పేర్కొన్నారు.
2. ఉప్పు:
ఉప్పులో సోడియం స్థాయి అధికంగా ఉంటుంది. అయితే ఉప్పును ఆహారంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ద్రవం మొత్తాన్ని పెంచుతుంది. దీని కారణంగా కిడ్నీపై ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది.
3. పాల ఉత్పత్తులు:
పాలు, చీజ్, జున్ను, వెన్న వంటి పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం కిడ్నీకి మంచిది కాదు. పాల ఉత్పత్తుల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి.
4. రెడ్ మీట్:
రెడ్ మీట్లో ప్రొటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే మన శరీరానికి ప్రొటీన్లు కూడా అవసరం. కానీ ఇవి అతిగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలను ప్రభావితం చేస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read: Teeth Whitening At Home: పాచి పండ్ల సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..!!
Also read: Horoscope Today July 2022: జూలై నెలలో ఈ నాలుగు రాశువారికి ఆర్థికపరమైన సమస్యలు.. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook