Viral Video: వధువును టచ్ చేసినందుకు.. స్టేజీ పైనే ఫోటోగ్రాఫర్‌ను చాచిపెట్టి కొట్టిన వరుడు

Latest Viral Videos: స్టేజీపై ఫోటోగ్రాఫర్ చేస్తున్న 'అతి'ని చూడలేకపోయిన ఓ వరుడు.. అతన్ని చాచిపెట్టి ఒక్కటి కొట్టాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 21, 2022, 03:11 PM IST
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వెడ్డింగ్ వీడియో
  • వధువును టచ్ చేసినందుకు ఫోటోగ్రాఫర్‌ను చాచిపెట్టి కొట్టిన వరుడు
  • స్టేజీపైనే ఫోటోగ్రాఫర్‌పై చేయి చేసుకున్న వరుడు.. పొట్ట చెక్కలయ్యేలా నవ్విన వధువు
Viral Video: వధువును టచ్ చేసినందుకు.. స్టేజీ పైనే ఫోటోగ్రాఫర్‌ను చాచిపెట్టి కొట్టిన వరుడు

Latest Viral Videos: సాధారణంగా పెళ్లిళ్లంటే వధూవరుల కన్నా ఫోటోగ్రాఫర్ల హడావుడే ఎక్కువగా ఉంటుంది. వాళ్లు చెప్పినట్లు ఫోటోలకు పోజులివ్వాలి.స్మైల్ అనగానే కెమెరా వైపు చూసి నవ్వాలి. తల ఇటు తిప్పండి, అటు తిప్పండని చెబితే విసుక్కోకుండా చెప్పినట్లు చేయాలి. తప్పదు మరి.. వెడ్డింగ్ ఆల్బమ్ బాగా రావాలంటే ఫోటోగ్రాఫర్ చెప్పినట్లు పోజులు పెట్టాల్సిందే. అయితే కొన్నిసార్లు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ల అతి పట్టరాని కోపం తెప్పించవచ్చు. ఇలాగే, ఓ ఫోటోగ్రాఫర్ చేసిన అతికి స్టేజీపై వరుడు కోపంతో ఊగిపోయాడు. స్టేజీ పైనే ఫోటోగ్రాఫర్‌ను చాచి ఒక్కటి కొట్టాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అసలేం జరిగిందంటే.. :

ఆ వీడియోను గమనిస్తే.. స్టేజీపై వధూవరులు ఉన్నారు. వరుడు స్టేజీకి ఒక పక్కన నిలబడి ఉండగా.. ఫోటోగ్రాఫర్ వధువును ఫోటోలు తీస్తున్నాడు. ఆమె ముఖం పైనే కెమెరా పెట్టి క్లోజప్స్ క్లిక్‌మనిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఫ్రేమ్‌కి తగినట్లుగా ఆమె ఫేస్‌ను అడ్జస్ట్ చేసేందుకు ఒకటి, రెండుసార్లు తన చేయితో ఆమె తల అటు, ఇటు తిప్పాడు. ఫోటోగ్రాఫర్ వధువును తాకగానే వరుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. వెంటనే చాచిపెట్టి ఒక్కటి కొట్టాడు. వరుడి దెబ్బకు ఫోటోగ్రాఫర్ షాకవగా.. ఆ నవ వధువు ఒక్కసారిగా పగలబడి నవ్వుతూ కింద కూలబడింది.

ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు కానీ 'పంజాబీ ఇండస్ట్రీ' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ వీడియో పోస్ట్ అయింది. వీడియో చూసిన నెటిజన్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు. గతంలోనూ ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే చక్కర్లు కొట్టారు. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

 

Also Read: Presidential Election: రాష్ట్రపతి ఎన్నికల్లో ట్విస్ట్.. టీఎంసీకి యశ్వంత్ సిన్హా రాజీనామా?

Also Read: Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ ఆఫర్స్.. రూ.14 వేలు విలువ చేసే థామ్సన్ స్మార్ట్ టీవీ కేవలం రూ.4499కే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News