EPFO News: సంఘటిత రంగాల్లోని వేతన జీవులకు.. పదవీ విరమణ అనంతరం ఆర్థికంగా అండగా నిలిచే.. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) మరో గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు సమాచారం. ఉద్యోగుల వేతన పరిమితనిని పెంచే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటపి వరకు ఉన్న వివరాల ప్రకారం.. ప్రస్తుత వేతన పరిమితి రూ.15వేలుగా ఉండగా.. దానిని రూ.21 వేలకు పెంచాలనే యోచనలో సమాచారం.
ఇదే విషయంపై కేంద్ర ప్రభుత్వం కూడా సంబంధిత శాఖలతో చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల చెబుతున్నాయి. ఇదే విషయంపై ఈపీఎఫ్ఓ ధర్మకర్తల బోర్డు ఈ ప్రతిపాదనను తెస్తే.. ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే కంపెనీలన్నీ ఇందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఈ ప్రతిపాదనతో కంపెనీలపై అదనపు భారం పడినా అందుకు కంపెనీలన్నీ సిద్దమేన్నది ఈ వార్తల సారాశం.
అయితే కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా కంపెనీలు నష్టాల్లో ఉన్నాయని.. అయితే ఈ ప్రతిపాదన అమలుకు మాత్రం కాస్త సమయం పెట్టొచ్చని ఈ విషయంతో సంబంధమున్న వర్గాలు అంటున్నాయి.
ఇక ఈ కొత్త ప్రతిపాదన అమలులోకి వస్తే 75 లక్షల మంది ఉద్యోగుల వరకు లబ్ది చేకూరనుందని అంచనాలున్నాయి.
ప్రస్తుతం కేంద్రం ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకోసం రూ.6,750 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈపీఎఫ్ఓ చందాదారుల బేసిక్ శాలరీ నుంచి 12 శాతం ఈపీఎఫ్‌లో జమ అవుతుంది. అంతే మొత్తం ఆ ఉద్యోగి పని చేసే సంస్థ కూడా బరిస్తుంది. ఇక బేసిక్ శాలరీలో 1.16 శాతం మాత్రమే పెన్షన్ స్కీమ్‌లో జమ అవుతుంది.
ప్రస్తుత వేతన పరిమితి ఇలా..
ఒక ఉద్యోగి గరిష్ఠవేతనం (పెన్షన్ లెక్కింపునకు) గరిష్ఠవేతనాన్ని రూ.15 వేలుగా ఉంది. 2014లో చేసిన సవరణల తర్వాత ఈ మొత్తానికి పెరిగింది. అంతకు ముందు రూ.6,500గా ఉండేది.
అయితే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ పరిమితిని రూ.21 వేలకు పెంచాలనే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం. అదే జరిగితే ఉద్యోగుల కనీస వేతనం పెరగనుంది.
ఇక ప్రస్తుతం ఒక సంస్థలో 20 లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉంటే ఈపీఎఫ్‌లో ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. ఈ పరిమితిని 10కు తగ్గించాలని కూడా డిమాండ్ ఉంది. అయితే ఈ విషయంపై ప్రభుత్వం నుంచి గానీ అటు ఈపీఎఫ్ఓ వర్గాల నుంచి గానీ అధికారిక స్పందన రాలేదు.
Also read: BSNL 4G Launch in India: BSNL 4G సేవలకు గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే కస్టమర్లకు అందుబాటులో!
Also read: Oppo F21 Pro 5G: రూ.31 వేల విలువైన Oppo F21 Pro 5G రూ.12 వేలకే అందుబాటులో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook