Google PlayStore: ప్రతి స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ లేదా ఐఓయస్ సాఫ్ట్‌వేర్‌పై నడుస్తూ ఉంటుంది. మొబైల్ లో ఏ చిన్న పనిచేయాలన్నా యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి స్మార్ట్‌ఫోన్‌కు యాప్ తప్పనిసరి. ఎప్పడి నుంచో ఫోన్‌కు సంబంధించిన పలు యాప్‌లు ఫోన్‌తోనే వస్తే.. మరికొన్ని ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ప్లేస్టోర్‌లో, యాపిల్ ఫోనైతే యాప్‌స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటాం. గత కొంత కాలంగా మారుతున్న కాలనికి అనుగుణంగా భద్రత, గోప్యత, సర్వీసుల దృష్టిలో ఉంచుకొని వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త అప్‌డేట్‌లను విడుదల చేస్తున్నాయి యాప్‌లు. యాప్‌లు విడుదలైనప్పటి నుంచి అప్‌డేట్ కాకపోవడంతో వాటిలోని భద్రతాపరమైన లోపాల కారణంగా యూజర్ డేటాను సైబర్ నేరగాళ్లు సులువుగా సేకరిస్తున్నారట.
ఇలాంటి నేరాలకు చెక్ పెట్టేందుకు గూగుల్ కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం. API ప్రమాణాలకు అనుగుణంగా యాప్‌లు పనిచేయాలని కోరింది. యాప్‌లు విడుదలైన సంవత్సరంలోపు అప్‌డేట్ తప్పనిసరిగా ఇవ్వని యాప్‌లను ఇకమీదట వినియోదారులు డౌన్‌లోడ్ చేసుకోలేరని ప్లేస్టోర్ తెలిపింది. అయితే యాప్‌లు ఎప్పడికప్పుడు క్రమం తప్పకుండా అప్‌డేట్ ఇవ్వాలని తెలిపింది. ఈ కొత్త నిబంధనను నవంబర్ 1, 2022 నుంచి అమల్లోకి రానున్నట్లు గూగుల్ తన పేజీ అయినా డెవలపర్ కమ్యూనిటీ బ్లాగ్ పేజ్‌లో వెల్లడించింది. రాబోతున్న నిబంధనల ప్రకారం ప్లేస్టోర్‌లోకి వచ్చే ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్ ఇవ్వకుంటే వినియోగదారులకు డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలుండదని గూగుల్ వెల్లడించింది.
ఎందుకీ నిర్ణయం తీసుకుంది ప్లే స్టోర్..?
"ప్రస్తుతం గూగుల్ సంస్థ ప్రతి సంవత్సరం సరికొత్త వెర్షన్ ఆండ్రాయిడ్ ఓఎస్‌ను విడుదల చేస్తుంది. వినియోగదారులకు కొత్త ఫీచర్లను పరిచయం చేయడమే కాకుండా, యాజర్లను భద్రతపరంగా ఓఎస్‌ను మరింత మెరుగుపరుస్తుందని సంస్థ తెలిపింది. నిత్యం ఈ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత యూజర్లు సైబర్ దాడుల నుంచి రక్షణ పొందామనే ఆలోచనతో ఉంటారని సంస్థ వెల్లడించింది. అయితే ఓఎస్ అప్‌డేట్ ప్రకారం యాప్స్ అప్‌డేట్ ఇవ్వకపోతే భద్రతాపరమైన లోపాల కారణంగా వినియోగదారుల డేటా సైబర్ నేరగాళ్లకు చేరే అవకాశాలుంటాయి.
అందుకే ప్లే స్టోర్ ఈ కొత్త నిబంధన పరిచయం చేయబోతోందని సమాచారం. ప్రతి యాప్ విడుదలైన సంవత్సరంలోపు తప్పకుండా గూగుల్ టార్గెట్ లెవల్ API అనుసరించి మార్పలు చేయాల్సిందనని" యాప్స్ డెవలపర్స్‌కు గూగుల్ సూచింది. అయితే ఈ నిబంధన ప్రకారం కొత్త వినియోగదారులకు అప్‌డేట్ కానీ యాప్‌లు ప్లేస్టోర్‌లో కనిపించవని సంస్థ తెలిపింది. ప్రస్తుతం ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న యూజర్లకే అందుబాటులో ఉంటాయని తెలిపింది.
Also Read: Cardless withdrawal: కార్డు లేకున్నా ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా: ఆర్బీఐ
Also Read: Yuzvendra Chahal: ఆ క్రికెటర్ ఫుల్‌గా తాగి.. 15వ అంతస్థు నుంచి నన్ను తోసేయబోయాడు: చహల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook