March Numerology: మార్చి నెలలో పుట్టిన పిల్లలకు అదృష్టం కలిసి వస్తుంది.. అదెలాగో తెలుసా!

March Numerology: మనలో చాలా మంది జోతిష్య, సంఖ్యా శాస్త్రాలను అనుసరిస్తారు. అయితే న్యూమరాలజీ ప్రకారం.. మార్చి 2022 నెలలో పుట్టిన బిడ్డలకు అదృష్టం కలిసి వస్తుందని తెలుస్తోంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 3, 2022, 12:27 PM IST
March Numerology: మార్చి నెలలో పుట్టిన పిల్లలకు అదృష్టం కలిసి వస్తుంది.. అదెలాగో తెలుసా!

March Numerology: జోతిష్య శాస్త్రం ప్రకారం.. కొందరు అదృష్టంతో జన్మిస్తారు. మరికొంతమంది పుట్టిన తర్వాత వారికి అదృష్టం కలిసి వస్తుంది. అయితే కొందరికి ఉన్న అదృష్టం వెంటనే ప్రభావం చూపకపోయినా.. కొందరికి చిన్న వయసులోనే అదృష్టం కలిసి వచ్చి సంపన్న వ్యక్తులుగా ఎదుగుతారు. ఈ క్రమంలో కొంతమంది జాతక రీత్యా అదృష్టవంతులైనా.. వారి జీవితంలో ఆశించిన ఫలితాలను అందుకోలేరు. కానీ, న్యూమరాలజీ ద్వారా మార్చి నెలలో పుట్టిన పిల్లలకు రెండు రెట్లు అదృష్టవంతులుగా మార్చే అవకాశం ఉంది. అయితే న్యూమరాలజీకి సంబంధించిన కిటుకు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

మార్చిలో పుట్టినవారు అదృష్టవంతులే..

న్యూమరాలజీ ప్రకారం.. మార్చి 2022లో పుట్టిన వారు జాతకరీత్యా అదృష్టవంతులుగా పరిగణిస్తున్నారు. దీంతో వీరంతా తమ లక్ష్యాలను నిర్దేశించుకోవడం సహా వాటిని చేరుకునేంతవరకు విశ్రమించరు. దాని వెనకున్న కారణం ఏంటంటే.. మార్చి నెలలో పుట్టిన పిల్లలకు ఒకే రాడిక్స్, బాగ్యంక్ అంకెలను కలిగి ఉంటారు. 

ఉదాహరణకు.. 2022 మార్చి 1న పుట్టిన బిడ్డకు రాడిక్స్ సంఖ్య 1 ఉంటుంది. దీనితో పాటు తేదీలోని మొత్తం అంకెలను కలిపితే 1 అంకె వస్తుంది. అదే విధంగా 2022 మార్చి 2న జన్మించిన రాడిక్స్ సంఖ్య 2, బాగ్యంక్ సంఖ్య 2గా ఉంటుంది. ఈ విధంగా మార్చిలో జన్మించిన ప్రతి బిడ్డకు ఇదే వర్తిస్తుంది. దీంతో యాదృచ్ఛికంగా ఈ నెలలో జన్మించిన ప్రతి బిడ్డకు అదృష్టం కలిసి వస్తుందని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. 

(నోట్: ఇక్కడ అందించిన సమాచారం సంఖ్యా శాస్త్రం నుంచి గ్రహించబడింది. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరించడం లేదు.) 

Also Read: Horoscope March 3 2022: నేటి రాశిఫలాలు... ఈ రాశివారు అనవసర ఖర్చులు ఎక్కువగా చేస్తారట!

Also Read: Astrology Predictions: ఈ పేర్లు ఉన్నవారు చిన్న వయసులోనే ధనవంతులు అవుతారు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News