Tamannaah Bhatia: అతడితో తమన్నా బ్రేకప్.. అసలు నిజం ఏంటి..?

Tamannaah breakup:  మిల్క్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న తమన్నా తొలిసారి తెలుగు ఇండస్ట్రీ లోకి శ్రీ అనే సినిమా ద్వారా అడుగు పెట్టింది. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రం  హ్యాపీడేస్ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా మరొకవైపు  గత ఏడాది ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో ప్రేమలో పడిందని, అతడిని వివాహం చేసుకోబోతోంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

1 /5

హ్యాపీడేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ప్రముఖ బ్యూటీ తమన్నా.. పలువురు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 19 సంవత్సరాలకు పైగానే అవుతున్నా.. ఇప్పటికీ స్టార్ స్టేటస్ ను అనుభవిస్తూ బిజీగా మారిన తమన్నా బ్రేకప్   చెప్పుకుందంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.   

2 /5

అసలు విషయంలోకి వెళ్తే.. గతంలో తనకు లవ్ బ్రేకప్ అయిందని ఆమె స్వయంగా చెప్పడం జరిగింది. అయితే ఆ బ్రేకప్ ఎవరితో జరిగింది అనే విషయం మాత్రం వెల్లడించలేదు. అయితే తమన్నా ఒక పాకిస్తాన్ క్రికెటర్ ను ప్రేమించిందని , అతనితోనే ఆమెకు బ్రేకప్ అయిందని ప్రచారం కూడా జరిగింది. పాకిస్థాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ తో తమన్నా డేటింగ్ చేసిందనే రూమర్స్ తెరపైకి వచ్చాయి . ఇద్దరూ క్లోజ్ గా ఉన్న ఫోటోలు కూడా అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. దీంతో అబ్దుల్ రజాక్ తో తమన్నా రిలేషన్ లో ఉందని ప్రచారం జరగగా.. ఆ తర్వాత దీనిపై తమన్న వివరణ కూడా ఇచ్చింది.

3 /5

తమన్నా మాట్లాడుతూ.. మేమిద్దరం  ఒక మాల్ ఓపెనింగ్ సమయంలో కలుసుకున్నాము. రజాక్ ను కలవడం అదే మొదటిసారి. అసలు మా మధ్య ఎలాంటి బంధం లేదని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా తమన్నా గత కొద్దిరోజులుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో పీకల్లోతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

4 /5

 ఏది ఏమైనా గతంలో బ్రేకప్ చెప్పుకున్నానని తెలిపిన ఈమె,  అతడు ఎవరు అనే విషయం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక పాకిస్థాన్ క్రికెటర్ తో ప్రేమలో ఉందంటూ వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని, తమన్నా స్వయంగా ప్రకటించి క్లారిటీ ఇవ్వడం గమనార్హం. 

5 /5

ఇకపోతే మిల్క్ బ్యూటీ తమన్నా ప్రస్తుతం తెలుగు,  తమిళ్ , హిందీ చిత్రాలలో నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.  అంతేకాదు ఐటెం సాంగ్ తో  ఆకట్టుకుంటున్న ఈమె ఐదు నిమిషాల ఐటమ్ సాంగ్ కోసం ఏకంగా కోట్ల రూపాయలు వసూల్ చేస్తూ సంచలనం సృష్టిస్తోంది.