ఎమ్మెల్యే కుమారుడికి డబ్బులు ఇస్తాగాని.. భార్యను ఎలా ఇవ్వగలను! రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యలో కొత్త ట్విస్ట్!!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో ఇప్పుడు ఓ పెద్ద సంచలనంగా మారింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2022, 12:46 PM IST
  • రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యలో కొత్త ట్విస్ట్
  • ఎమ్మెల్యే కుమారుడికి డబ్బులు ఇస్తాగాని.. భార్యను ఎలా ఇవ్వగలను
  • సంచలనంగా మారిన రామకృష్ణ సెల్ఫీ వీడియో
ఎమ్మెల్యే కుమారుడికి డబ్బులు ఇస్తాగాని.. భార్యను ఎలా ఇవ్వగలను! రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యలో కొత్త ట్విస్ట్!!

Selfie Video goes viral in Palvancha's Naga Ramakrishna family suicide case: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా పాల్వంచ (Palvancha)లో నాగ రామకృష్ణ (Naga Ramakrishna) కుటుంబం ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో మరో ట్విస్ట్ (New Twist) బయట పడింది. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో (Ramakrishna Selfie Video) ఇప్పుడు ఓ పెద్ద సంచలనంగా మారింది. ఆత్మహత్య నిర్ణయానికి దారి తీసిన పరిస్థితులను ఆయన వీడియోలో వివరించారు. వీడియోలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవపై రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు. వనమా రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయని, రాఘవ దురాగతాలతో ప్రజలు ఎలా బతకాలి అని రామకృష్ణ ప్రశ్నించారు. రాఘవ లాంటి దుర్మార్గులను రాజకీయంగా ఎదగనివ్వొద్దని కోరారు. 

'వనమా రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యాయి. రాఘవ దురాగతాలతో ప్రజలు ఎలా బతకాలి. అతని లాంటి దుర్మార్గులను రాజకీయంగా అస్సలు ఎదగనివ్వొద్దు. డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడిని కానీ.. ఏ భర్త కూడా వినగూడని మాట వనమా రాఘవ అడిగారు. నా భార్యను హైదరాబాద్ తీసుకురావాలని అడిగారు. పిల్లలు లేకుండా ఒంటరిగా హైదరాబాద్ రమ్మన్నారు. రాజకీయ, ఆర్ధిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారు. 12 సంవత్సరాల మా సంసార జీవితంలో ఏ రోజు కలహాలు లేకుండా చూసుకున్నాను. అన్ని రకాల హామీలు ఇచ్చి నా భార్యను పెళ్లి చేసుకున్నాను. ఏ రకంగా నేను పంపించగలను' అని నాగ రామకృష్ణ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. 

Also Read: Women's World Cup 2022: ప్రపంచకప్ జట్టును ప్రకటించిన బీసీసీఐ.. స్టార్ ప్లేయర్ ఔట్! కెప్టెన్‌ ఎవరంటే?

'నా భార్యను పంపిస్తే ఆస్తి సమస్య పరిష్కరిస్తానని వనమా రాఘవ హామీ ఇచ్చారు. ఎంత మందితో చెప్పుకున్నా నీ సమస్య పరిష్కారం కాదు. నీ ఆస్తి నయా పైసా కూడా రాదు అని బెదిరించారు. నా భార్య నాకోసం వచ్చింది. ఎమ్మెల్యే కుమారుడికి డబ్బులు ఇస్తాగాని.. భార్యను ఎలా ఇవ్వగలను. నేను ఒక్కడిని ఆత్మహత్య చేసుకుంటే నా భార్యను ఏమైనా చేస్తారు. నా పిల్లలు కూడా అన్యాయం అవుతారు. నా భార్యకు ఈ విషయం అసలు తెలియదు. నేను చేసేది తప్పు అని తెలిసినా..  మీరెవరికి అన్యాయం జరగొద్దని (Naga Ramakrishna Family Suicide) ఈ నిర్ణయం తీసుకుంటున్నా' అని నాగ రామకృష్ణ వీడియోలో పేర్కొన్నారు. 

'నేను ఏంటో మా వీధీలో అందరికీ తెలుసు. నేను అభియోగం చేస్తున్నానని కొందరు అనుకోవచ్చు. వారికి ఒకటే చెపుతున్నా.. ఇలాంటి రికార్డింగ్, ఫొటోలు ఉండవు. నా నిర్ణయాన్ని తప్పు పట్టకండి. నా జీవితం ఎలా అయినా పరువాలేదు.. నాకు ఆర్ధిక సహాయం చేసిన వారికి నష్టం జరగకూడదు. నా తండ్రి ద్వారా నాకు వచ్చే ఆస్తిని నాకు ఆర్ధిక సహాయం చేసిన వారికి ఇవ్వండి. వనమా రాఘవ (Vanama Raghava) ఇలాంటి దుర్మార్గులను మాత్రం ఎదగనివ్వకండి. ఇలాంటి వ్యక్తి వల్ల లోకంలో ఎవరు బతుకుతారు, ముఖ్యంగా సామాన్యులు ఎలా జీవనం కొనసాగిస్తారు' అని నాగ రామకృష్ణ వీడియో (Ramakrishna Selfie Video)లో ఆవేదనకు గురయ్యారు. 

Also read: Man Attacks Bindu Ammini: శబరిమల గుడిలోకి ప్రవేశించిన బిందు అమ్మినిపై దాడి.. వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News