మేఘాలయలో ఎట్టకేలకు ప్రభుత్వం ఎవరు ఎలా నెలకొల్పాలన్న విషయంలో క్లారిటీ వచ్చింది. 19 స్థానాలు కలిగిన ఎన్పీపీ, 2 సీట్లు ఉన్న బీజేపీకి మద్దతివ్వడానికి ముందుకొచ్చింది. ఎన్పీపీ నేత కన్రాడ్ సంగ్మా సీఎం పీఠాన్ని కొద్ది రోజుల్లో అధిష్టించనున్నారు. ఎన్నికల్లో 6 సీట్లు గెలుచుకున్న యూడీపీ, 21 సీట్లు కైవసం చేసుకున్న కాంగ్రెస్కు మద్దతు ఇవ్వకుండా, బీజేపీ-ఎన్పీపీ పక్షాలకు మద్దతివ్వడానికి నిర్ణయం తీసుకోవడంతో ఎట్టకేలకు ఏమవుతుందోనని ఆసక్తిగా ఎదురుచూసిన ప్రజల సందేహానికి తెరపడింది. ముఖ్యంగా కాంగ్రెస్ గట్టిపోటీ ఇచ్చి అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నా.. ఎన్పీపీ బీజేపీ వైపే మొగ్గుచూపడంతో పరిస్థితి తలకిందులైంది.
.@SangmaConrad signs on the dotted lines pic.twitter.com/7LWEKxhD4J
— amrita madhukalya (@visually_kei) March 4, 2018