Pawan Kalyan Fires on AP Government: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై ఫైర్ అయ్యారు.
'నేటి బాలలే రేపటి పౌరులు అని చెబుతుంటాం., కానీ పిల్లల హక్కులకు పాటుపడాల్సిన ప్రభుత్వ పెద్దలే వారి హక్కులను హరిస్తున్నారంటూ' విమర్శలు చేశారు. ఏపీలో తాము చదువుకునే పాఠశాలలు తీసేయొద్దు అని విద్యార్థులు ఆందోళన చేసే పరిస్థితి వచ్చిందన్నారు.
అప్పుడు ‘అమ్మ ఒడి' ఇప్పుడు ‘అమ్మకానికో బడి' అంటూ జగన్ సర్కార్‌పై సెటైర్ వేశారు పవన్.
ఎయిడెడ్ పాఠశాలల విలీనంపై ఏపీ సర్కారు నవంబరు 12న నాలుగు ఆప్షన్లతో సర్క్యులర్ మెమో ఇచ్చిందని పవన్ ట్విట్టర్లో.. ఆ జీవోకి సంబంధించిన పత్రాలను పోస్ట్ చేశారు.
అప్పుడు ‘అమ్మ ఒడి'
ఇప్పుడు ‘అమ్మకానికో బడి' ..1) YCP Govt on 12th November, 2021 issued a Circular Memo No 1072635/CE/A1/2020 which provided a policy (4 options) for facilitating the surrender of willing aided private educational institutions. pic.twitter.com/NoPaFN04Xr
— Pawan Kalyan (@PawanKalyan) November 14, 2021
Also read: Visakhapatnam: ప్రేమను నిరాకరించిందని.. యువతిపై పెట్రోల్ తో దాడి..ఆపై...
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రెండున్నర లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుందన్నారు. 6,700 మంది టీచర్ల ఉపాధి కోల్పోయే ప్రమాదముందని పేర్కొన్నారు.
Also read: Amit Shah: ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిపై అమిత్ షా ప్రశంసల వర్షం
విద్యా సంవత్సరం మధ్యలో ఉండగా.. ఎయిడెడ్ విద్యాసంస్థలను స్వాధీనం చేసుకునేందుకు జగన్ సర్కార్ ఇంత హడావుడి ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేన్నారు.
ఒకవేళ ఎయిడెడ్ పాఠశాలకు సాయం అందించాలనుకుంటే.. స్వాధీనం మాత్రమే మార్గమా అని ప్రశ్నించారు పవన్. ప్రత్యామ్నాయాల మార్గాలు లేవా? అని దీనిపై ప్రభుత్వం నిర్ణయం చెప్పాలని డిమాండ్ చేశారు.
Also read: AP CM YS Jagan convoy వెంట పరుగెత్తిన మహిళ.. కారు ఆపిన సీఎం జగన్
Also read: Road Accident: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు యువకులు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook