Etela Rajender News: మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూముల వ్యవహారం విచారణ వేగవంతమైంది. కరోనా కారణంగా ఇన్నాళ్లు విచారణ పెండింగ్‌లో పడింది. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 16 నుంచి విచారణ చేయనున్నారు. ఇప్పటికే అచ్చంపేట, హాకీంపేటలో కూడా సర్వే కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ సతీమణికి చెందిన జమునా హ్యాచరీస్‌కు జూన్‌లోనే నోటీసులు జారీ చేశారు. అయితే కరోనా కారణంగా విచారణ ముందుకు సాగలేదు. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో విచారణ వేగవంతం చేయనున్నారు.
ఈ సందర్భంగా జమునా హర్చరీస్ సంస్థకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని నోటిసుల్లో కోరింది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో అసైన్డ్ భూములు కబ్జా చేసినట్లు ఈటెల కుటుంబం ఆరోపణలు ఎదుర్కొంటోంది.
ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ సర్కార్‌లో మంత్రిగా ఉన్న ఈటల బర్తరఫ్కు గురయ్యారు. అనంతరం ఎమ్మెల్యే పదివికి రాజీనామా చేసి, హుజురాబాద్ నియోజకవర్గం కోసం జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచారు. అయితే, ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమునా హర్చరీస్‌కు జూన్‌లోనే నోటీసులు జారీ చేసినప్పటికీ.. కోవిడ్ దృష్ట్యా హైకోర్టు ఆదేశాలతో సర్వే వాయిదా పడింది. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత తగ్గిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో 16 న పూర్తిస్థాయిలో విచారణ జరగనుంది.
Also Read: CM KCR: నన్ను జైలుకు పంపే దమ్ము భాజపా నేతకు ఉందా?: సీఎం కేసీఆర్
Also Read: Peddapalli MLA: పెద్దపల్లి ఎమ్మెల్యేకు చేదు అనుభవం- రాజీనామా చేయాలంటూ ప్రజల డిమాండ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook