Hajj 2022 online application last date: ముంబై : హజ్‌యాత్ర 2022కు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. హజ్ యాత్రకు వెళ్లేవారి నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించిన సందర్భంగా సోమవారం దక్షిణ ముంబైలోని హజ్‌హౌజ్‌లో కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మీడియాతో మాట్లాడుతూ హజ్ యాత్రకు సంబంధించిన పలు వివరాలు వెల్లడించారు.
హజ్ యాత్రకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 100 శాతం ఆన్లైన్లోనే జరుగుతుందని మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పష్టంచేశారు. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరించనున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. సౌదీ అరేబియాలోని ధరలతో పోల్చితే 50 శాతం తక్కువకే యాత్రికులు తమకు కావాల్సినవి కొనుగోలు చేయవచ్చని కేంద్ర మంత్రి యాత్రికులకు (Hajj pilgrims) వెల్లడించారు.
కొవిడ్-19 థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు, హజ్ యాత్రకు (Hajj 2022) వెళ్లాలి అనుకునే వారు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పలు సూచనలు చేశారు.