Pawan Kalyan Tour: రాజమండ్రిలో ముగిసిన పవన్ కళ్యాణ్ పర్యటన

Pawan Kalyan Tour: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి సభ ఏ విధమైన ఆటంకాలు లేకుండా సాగింది. అటు ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ పర్యటనను ఆపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 2, 2021, 03:08 PM IST
  • రాజమండ్రి బాలాజీపేట జంక్షన్ వద్ద ముగిసిన పవన్ కళ్యాణ్ బహిరంగ సభ
  • వైసీపీతో యుద్ధానికి సై అని పిలుపునిచ్చిన పవన్
  • పవన్ కళ్యాణ్ పర్యటనను ఆపాల్సిన అవసరం లేదన్న వైసీపీ నేత సజ్జల
 Pawan Kalyan Tour: రాజమండ్రిలో ముగిసిన పవన్ కళ్యాణ్ పర్యటన

Pawan Kalyan Tour: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి సభ ఏ విధమైన ఆటంకాలు లేకుండా సాగింది. అటు ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ పర్యటనను ఆపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో జనసేన (Janasena)అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ముగిసింది. ఏ విధమైన ఆటంకాల్లేకుండా సాగింది. రాజమండ్రి బాలాజీపేట జంక్షన్ వద్ద ఏర్పాటైన బహిరంగసభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో యుద్ధానికి సిద్ధమని పిలుపునిచ్చారు. ఈ నేల..ఏపీ పట్ల తాను రుణపడి ఉన్నానని, అందుకే పార్టీ నడుపుతున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. 

మరోవైపు రాజమండ్రిలోని పవన్ కళ్యాణ్ పర్యటన(Pawan Kalyan Tour) పట్ల ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పవన్ కళ్యాణ్ పర్యటనను ఆపాల్సిన అవసరం తమకు లేదన్నారు. కోవిడ్ నిబంధనలు అందరికీ సమానమేనని..ప్రజల ఆరోగ్యం కోసమే నిబంధనలున్నాయని చెప్పారు. ఇలాంటి సమయంలో బలప్రదర్శన వల్ల నష్టపోయేది ప్రజలేనని గుర్తు చేశారు. అక్టోబర్ నెలలో కోవిడ్ సంక్రమణ పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారన్నారు. రోడ్ల గుంతలు మీరు పూడ్చడమేంటని సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) ప్రశ్నించారు. రోడ్ల మరమ్మత్తు పనుల కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 22 వందల కోట్లు కేటాయించారన్నారు. వర్షాలు తగ్గగానే పనులు ప్రారంభమవుతాయన్నారు. ఈలోగా టెండర్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. తెలుగుదేశం హయాంలో 8 వందల కోట్ల బిల్లులు చెల్లించకపోతే తమ ప్రభుత్వం చెల్లించిందన్నారు. తెలుగుదేశం హయాంలో ఒక్క రోడ్డు కూడా వేయలేదని..అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమయ్యారని నిలదీశారు. 

వైఎస్సార్ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ(Mahatma Gandhi Jayanti), లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకుల్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. గాందీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ ఓ యుగ పురుషుడని కొనియాడారు. ప్రజాస్వామ్యానికి నిజమైన అర్ధంలో గాంధీ సూక్తులున్నాయన్నారు. గాంధీ మార్గంలో పయనించేందుకు పునరంకితమౌదామని, ప్రజలంతా భాగస్వామ్యులు కావాలని కోరారు. 

Also read: Rashmika Mandanna: అండర్వేర్ యాడ్ ఎఫెక్ట్, రష్మికపై భారీగా ట్రోలింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News