Zerodha Comapny: ఫిట్‌ గా ఉంటే చాలు ఒక నెల జీతం బోనస్ & అక్షరాల రూ.10 లక్షలు గెలిచే ఛాన్స్

కరోనా సంక్షోభంలో అందరికీ సగం జీతం వస్తే, ఈ కంపెనీ మాత్రం బోనస్ ఇస్తుంది, అది కూడా ఫిట్ గా ఉంటే చాలు ఒక నెల జీతం బోనస్ తో పాటు రూ.10 లక్షలు లక్కీ డ్రా ఇస్తామని స్టార్టప్ కంపెనీ జిరోధా బ్రోకింగ్ లిమిటెడ్ ప్రకటించింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 31, 2021, 07:25 PM IST
  • ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తే ఒక నెల జీతం బోనస్
  • లక్కీ డ్రా ద్వారా 10 లక్షల రూపాయల బహుమతి
  • ట్విట్టర్ ద్వారా తెలిపిన ఫౌండర్ నితిన్ కామత్
  • ఈ ఐడియాకు నెటిజన్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్
Zerodha Comapny: ఫిట్‌ గా ఉంటే చాలు ఒక నెల జీతం బోనస్ & అక్షరాల రూ.10 లక్షలు గెలిచే ఛాన్స్

కరోనా సంక్షోభం (Corona Crisis) తరువాత ప్రపంచమంతా అల్లకల్లోలమై, బతకడమే భారమైన సందర్భంలో నెల జీతం మీద ఆధారపడి జీవిస్తున్నవారి స్థితి మరీ దారుణం. ఉన్న జీతాలను తీసేయడం, సగం జీతాలు ఇవ్వడంతో ఆర్థికంగా నరకం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉద్యోగులు. మరోవైపు కోవిడ్ వచ్చాక ఆరోగ్యం మీద సైతం ఎప్పటిలా కంటే కాస్త ఎక్కువ శ్రద్ద తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని వలన రోజువారీ ఖర్చుల కంటే పౌష్టికాహారం కోసం ఎక్కువే వెచ్చించాల్సి వస్తుంది. 

ఒకవైపు కరోనా (Corona virus) కారణంగా సగం జీతాలు, మరోవైపు మంచి ఆహరం కోసం పెరిగిన ఖర్చులు చూస్తుంటే ఏ మధ్య తరగతి కుటుంబానికైనా ఇబ్బందే కదా. సరిగ్గా ఇదే సమయంలో బోనస్ (Bonus) ఇస్తామని ఆఫర్ వస్తే ఎగిరిగంతేస్తాం. ఈ విపత్కర సమయంలో ఏ పనైనా చేసి డబ్బులు సంపాదించమే లక్ష్యంగా మనం చూస్తుంటే.. ఓ కంపెనీ తమ ఉద్యోగులకు వినూత్న ఆఫర్ ఇచ్చింది. ఫిట్‌నెస్ (Fitness) మెయింటైన్ చేస్తే ఒక నెల జీతం బోనస్ గా ఇస్తామని ప్రకటించింది. అంతేకాకుండా వారందరి పేర్లతో లక్కీ డ్రా నిర్వహించి ఒకరికి పది లక్షలు ఇస్తామని తెలిపింది. 

Also Read: Seetimarr Trailer: "సౌత్ కా సత్తా మార్ కే నై.. 'సీటీమార్' కే దికాయేంగే" గోపిచంద్ సినిమా ట్రైలర్

వివరాల్లోకి వెళ్తే.. స్టార్టప్ కంపెనీ జిరోధా బ్రోకింగ్ లిమిటెడ్ (Zerodha Broking Limited) తమ ఉద్యోగుల ఆరోగ్యం కోసం కొన్ని రివార్డ్స్ ప్రకటించింది. ఉద్యోగుల ఫిట్‌నెస్ కోసం జిరోధా కంపెనీ తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని ఆ కంపెనీ ఫౌండర్ నితిన్ కామత్ (Nithin Kamath) తన ట్వీట్స్ ఖాతా ద్వారా తెలిపారు. వర్క్ టార్గెట్స్‌తో పాటు హెల్త్ టార్గెట్స్ కూడా జిరోధా కంపెనీ ఉద్యోగులకు ఆఫర్ చేస్తుంది. 12 నెలల పాటు హెల్త్ టార్గెట్స్ నిర్ణయించి, ప్రతీ నెలా ఫిట్‌నెస్ విషయంలో సాధించిన పురోగతి ఎప్పటికప్పుడు మాకు అప్‌డేట్ చేయాలని ఉద్యోగులకు కంపెనీ తెలిపింది. 

ఈ ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌ (Fitness Program) ఆఫర్ లో ఉద్యోగులు ఆసక్తిగా పాల్గొనాలనే ఉద్దేశంతో రివార్డ్స్ ప్రకటించినట్టు కంపెనీ ఫౌండర్ నితిన్ కామత్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇచ్చిన ఆరోగ్య టార్గెట్ విజయవంతంగా పూర్తి చేసి, ఫిట్‌నెస్‌తో ఉన్నవారికి ఒక నెల జీతం బోనస్‌గా ఇస్తామని తెలిపారు. ఇది కాకుండా, టార్గెట్ చేరుకున్న వారందరికీ లక్కీ డ్రా నిర్వహించి గెలుపొందిన వారికి రూ.10,00,000 ఇస్తామన్నారు.

Also Read: Digital Gold: ఒక్క రూపాయితోనే బంగారం కొనొచ్చు.. అదెలాగంటే..??

కరోనా సంక్షోభ (Corona Crisis) సమయంలో ఉన్న జీతానికే దిక్కులేని పరిస్థితుల్లో ఆరోగ్య నియమాలు పాటించమని చెప్పి మరీ బోనస్ కూడా ఇస్తున్న నితిన్ కామత్ (Nithin Kamath) ఐడియాకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. జిరోధా నిర్వహిస్తున్న ఫిట్‌నెస్ ప్రోగ్రామ్ ఆఫర్ పలువురి నుంచి ప్రశంసల్ని అందుకుంటోంది.

మాములు సమయంలో ఉద్యోగులకు నెలనెలా జీతం ఇచ్చి పనిచేయించుకుంటున్న కంపెనీలు.. తమ కంపెనీ నిర్మాణంలో ఉద్యోగుల భాగస్వామ్యం కీలకం అని, కనీసం వారి శ్రమను గుర్తించి ఆర్థికంగా అండగా నిలబడకుండా, తీరా విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఉద్యోగంలోంచి తీసేయడం లేదా సగం జీతం ఇస్తున్న అనేక కంపెనీలకు తీరును చూస్తున్న మనం ఈ జిరోధా బ్రోకింగ్ లిమిటెడ్ స్టార్టప్ కంపెనీ (Zerodha Broking Limited) తీసుకున్న నిర్ణయం మానవత్వంతో కూడుకున్నదని ఇతర కంపెనీల ఉద్యోగులు మాట్లాడుకుంటున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook

 

Trending News