India Corona Vaccination: ఇండియాలో దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం భారత్‌లో తగ్గిపోయిందని ప్రజలు భావిస్తున్నారు. కానీ గత నెల రోజులుగా ప్రతిరోజూ దేశంలో 40 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే కరోనా థర్డ్ వేవ్ త్వరగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దేశంలో గడిచిన 24 గంటల్లో 19 లక్షల 36 వేల 709 శాంపిల్స్ పరీక్షించగా 41,157 మందికి కరోనా బారిన పడినట్లు నిర్ధారణ అయింది. తాజా కేసులతో కలిపితే భారత్‌లో మొత్తం కరోనా (CoronaVirus) బాధితుల సంఖ్య దాదాపు 3.12 కోట్లకు చేరుకుంది. అదే సమయంలో కరోనా వైరస్‌తో పోరాడుతూ మరో 518 మంది చనిపోయారు. ఇండియాలో కరోనా మరణాల సంఖ్య 4,13,609 (4 లక్షల 13 వేల 609)కు చేరుకుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదివారం (జులై 18న) ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, మరియు కోవిడ్19 నిబంధనలు పాటించడం ద్వారా కరోనా మహమ్మారిన అరికట్టవచ్చునని అధికారులు చెబుతున్నారు.
Also Read: Maharashtra Landslide: భారీ వర్షాలకు విరిగిపడ్డ కొండచరియలు, 11 మంది మృతి
India reports 41,157 new COVID cases, 42,004 recoveries, and 518 deaths during the last 24 hours
Active cases: 4,22,660
Total discharges: 3,02,69,796
Death toll: 4,13,609Total vaccination: 40,49,31,715 pic.twitter.com/b3uiGSvpNL
— ANI (@ANI) July 18, 2021
శనివారం ఒక్కరోజులో 42,004 మంది కరోనా వైరస్‌ను జయించారు. దేశంలో కరోనా విజేతల సంఖ్య 3,02,69,796 (3 కోట్ల 2 లక్షల 69 వేల 796)కు చేరింది. దేశంలో యాక్టివ్ కరోనా కేసులు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. యాక్టివ్ కేసులు ప్రస్తుతం 4,13,609 (4 లక్షల 13 వేల 609) ఉన్నాయని బులెటిన్‌లో తెలిపారు. జనవరిలో వ్యాక్సినేషన్ ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు 40,49,31,715 (40 కోట్ల 49 లక్షల 31 వేల 715) కరోనా టీకా (Indias First Covid-19 Patient) డోసులను ప్రజలు తీసుకున్నారు. దేశంలో ఇప్పటివరకూ 44,39,58,663 (44 కోట్ల 39 లక్షల 58 వేల 663) కరోనా శాంపిల్స్‌కు టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ ఓ ప్రకటనలో తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook