Vaccine for Children: చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ విషయంలో ఇంకా అస్పష్టత నెలకొంది. చిన్నారులకు వ్యాక్సిన్ ఇవ్వడం మరింత ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. ఈ విషయంలో మరింత డేటా అవసరమని భావించడమే దీనికి కారణం.
దేశంలో కరోనా వ్యాక్సినేషన్(Corona Vaccination) ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోంది. వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కొత్తగా మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. దీని ప్రకారం గర్భిణీలకు సైతం వ్యాక్సిన్ ఇవ్వాలని స్పష్టం చేసింది.మొన్నటి వరకూ గర్భిణీలు, చిన్నారులకు తప్ప మిగిలినవారికి వ్యాక్సిన్ చేసేవారు. ఇప్పుడు కొత్తగా గర్భిణీలకు వ్యాక్సిన్ ప్రారంభించారు. అయితే చిన్నారులకు వ్యాక్సిన్ విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలా వద్దా అనేది తేల్చేందుకు మరింత డేటా అందాల్సి ఉందని ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు. చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్ వేయడంపై ఇంకా చర్చ జరుగుతోంది. అవసరమైన మరింత సమాచారం అందితేనే దీనిపై స్పష్టత వస్తుందని ఐసీఎంఆర్ వెల్లడించింది. ప్రపంచ మొత్తం మీద ఒక్క అమెరికాలనే చిన్నారులకు వ్యాక్సిన్ ఇస్తున్నారని(Vaccination for children)..టీకా తీసుకున్న చిన్నారుల్లో కొన్ని సమస్యలు వస్తున్నాయని తెలిపింది.
ఈ నేపధ్యంలో ఇండియాలో చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్ మరింత ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. 2-18 ఏళ్ల వయస్సువారికి వ్యాక్సిన్ ఇవ్వడంపై పరిశోధనలు కొనసాగుతున్నాయని..సెప్టెంబర్-అక్టోబర్ నాటికి ఫలితాలు వస్తాయని ఐసీఎంఆర్ (ICMR) డైరెక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు. ఆ నివేదికను బట్టి చిన్నారులకు వ్యాక్సిన్ విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
Also read: ICMR: కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లపై ఐసీఎంఆర్ గుడ్‌న్యూస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook