Allu Arjun గురించి యాంకర్ Anasuya ఏమందో తెలుసా ?

Anchor Anasuya about Allu Arjun: అల్లు అర్జున్ అంటే ఇష్టం లేనిది ఎవరికి చెప్పండి. అల్లు అర్జున్ హార్డ్ వర్క్ చూసిన వాళ్లకు ఎవరికైనా ఆయన డెడికేషన్‌కి ఫిదా అవ్వాల్సిందే. యాంకర్ అనసూయ విషయంలోనూ అదే జరిగిందట. పుష్ప మూవీలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న యాంకర్ అనసూయ తన సీన్స్ షూటింగ్ కోసం గత నెలలో పుష్ప షూటింగ్‌కి వెళ్లింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 25, 2021, 06:56 AM IST
Allu Arjun గురించి యాంకర్ Anasuya ఏమందో తెలుసా ?

Anchor Anasuya about Allu Arjun: అల్లు అర్జున్ అంటే ఇష్టం లేనిది ఎవరికి చెప్పండి. అల్లు అర్జున్ హార్డ్ వర్క్ చూసిన వాళ్లకు ఎవరికైనా ఆయన డెడికేషన్‌కి ఫిదా అవ్వాల్సిందే. యాంకర్ అనసూయ విషయంలోనూ అదే జరిగిందట. పుష్ప మూవీలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న యాంకర్ అనసూయ తన సీన్స్ షూటింగ్ కోసం గత నెలలో పుష్ప షూటింగ్‌కి వెళ్లింది. యాంకర్ అనసూయకు సంబంధించిన సీన్స్ షూటింగ్ జరుగుతుండగానే నాలుగైదు రోజులకు కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. అయితే, అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ తాజాగా అల్లు అర్జున్‌ని ఆకాశానికెత్తింది అనసూయ.

Also read : Anchor Anasuya's role in Pushpa: యాంకర్ అనసూయకు గుడ్ న్యూస్

అల్లు అర్జున్ ఎంత హార్డ్ వర్క్ చేస్తారో, చేసే పని పట్ల ఎంత నిబద్ధత కలిగి ఉంటారో తాను పుష్ప మూవీ షూటింగ్‌లో చూశానని, అందుకే ఆయన అంత పెద్ద స్టార్ అయ్యారని స్టైలిష్ స్టార్‌ని అనసూయ ప్రశంసల్లో ముంచెత్తింది. మళ్లీ ఎప్పుడెప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందా ? ఎప్పుడెప్పుడు అల్లు అర్జున్ (Allu Arjun) పర్‌ఫామ్ చేస్తుంటే చూడాలా అని ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నానని అనసూయ (Anchor Anasuya) ఏమీ దాచుకోకుండా చెప్పుకొచ్చింది.

Also read : Sarkau vaari Paata first look: సర్కార్ వారి పాట ఫస్ట్ లుక్ పోస్టర్ అప్‌డేట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News