/telugu/photo-gallery/how-to-make-easy-and-delicious-bakery-style-plum-cake-here-pr-ocess-of-making-rv-187168 Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా 187168

7th Pay Commission Latest News | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏడో వేతన సంఘం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం శుభవార్త అందించింది. పెండింగ్‌లో ఉన్న డియర్‌నెస్ అలవెన్స్ (Dearness Allowances) అందించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ భరోసా ఇచ్చింది. వారికి గత ఏడాది నుంచి మొత్తంగా 3 వాయిదాలు పెండింగ్‌లో ఉన్నాయి. జనవరి 2020, జూలై నెలతో పాటు ఈ ఏడాది జనవరిన మరో డీఏ వారికి విడుదల కావాల్సి ఉంది.

డీఏ ప్రకటన కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు శుభవార్త లభించింది. పెండింగ్‌లో ఉన్న వాయిదాల భత్యం సవరించిన రేట్లలో 2021 జూలై 1 నుండి అమలులోకి రానుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. గత ఏడాది కరోనా వైరస్‌ను ఎదుర్కొనడంలో, కోవిడ్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సొమ్ము రూ.35,430 కోట్లు కేంద్రం వినియోగించుకుంది.

Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్, త్వరలోనే Dearness Allowance జమ

గతంలో జరిగిన శాలరీని ఇలా లెక్కించారు.. 
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం వచ్చే బేసిక్ శాలరీని 2.57 కారకంతో గుణించాలి, ఆపై వచ్చే మొత్తానికి, TA, HRA మరియు మెడికల్ అలవెన్స్ జత చేస్తారు. మొత్తం విలువ ఉద్యోగుల జీతంగా పరిగణిస్తారు. ఉదాహరణకు 6వ వేతన సంఘం విషయం తీసుకుంటే.. 

ఒక ఉద్యోగి బేసిక్ శాలరీ కనుక 30,000 ఉన్నట్లయితే ఆ మొత్తాన్ని  2.57 కారకంతో గుణించాలి. ఆ మొత్తం రూ. 77,100 అవుతుంది. ఆ విలువకు TA, HRA మరియు మెడికల్ అలవెన్స్ కలపాలి. అంటే 77,100 + ఈ 3 రకాల అలవెన్స్ మొత్తం కలిపితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కొత్త జీతం విలువ ఎంతో తెలుస్తుంది.

Also Read: EPF Interest Rate: EPFO ఖాతాదారులకు కేంద్రం శుభవార్త, 6 కోట్ల మంది హర్షం 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
7th Pay Commission: How To Calculate Employees Salary With New DA, TA And Medical Allowance
News Source: 
Home Title: 

7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు శాలరీని ఈ లెక్కలతో అంచనా వేస్తున్నారు

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు శాలరీని ఈ లెక్కలతో అంచనా వేసుకుంటున్నారు
Caption: 
7th Pay Commission Latest News
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
7th Pay Commission Latest News: కేంద్ర ఉద్యోగులు శాలరీని ఈ లెక్కలతో అంచనా వేస్తారు
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Friday, March 12, 2021 - 17:02
Request Count: 
197
Is Breaking News: 
No