కరోనా వైరస్ ( Coronavirus ) మొత్తం ప్రపంచాన్ని వణికించేస్తుంది. కరోనా సెకండ్ వేవ్ ( corona second wave ) ఇప్పుడు గజగజలాడిస్తోంది. ఆ దేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు కరోనా వైరస్ కారణంగా మరణిస్తున్నారన్న హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి.
మొత్తం ప్రపంచాన్ని కరోనా వైరస్ చుట్టేసింది. వైరస్ తగ్గుముఖం పట్టకముందే యూరోపియన్ ( European countries ), ఇతర దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైపోయింది. ఇరాన్ లో అదే పరిస్థితి. ఇటీవలికాలంలో కరోనా కారణంగా మృతి చెందుతున్నవారి సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. టెహ్రాన్ సహా దేశంలోని అన్ని ఆస్పత్రుల్లో పరిస్థితి విషమించిందని ఇరాన్ ( Iran ) ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇరాన్ దేశంలో కరోనా రోగుల కోసం బెడ్స్ ఖాళీగా లేని పరిస్థితి తలెత్తింది.
ఇరాన్ దేశంలోని ఆరోగ్యసిబ్బంది మొత్తం శారీరకంగా మానసికంగా అలసిపోయారని..పరిస్థితి పూర్తిగా వికటిస్తోందని కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ కు చెందిన ఓ అదికారి ఇరాన్ దేశపు ప్రముఖ న్యూస్ ఛానెల్ కు వెల్లడించారు. కోవిడ్ 19 ( Covid 19 ) ప్రోటోకాల్స్ ను పాటిస్తున్నా సరే పరిస్థితిలో మార్పు రావడం లేదని తెలిపారు. తీవ్ర పరిణామాలు ఎదురుకానున్నాయని ఇప్పటికే ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరించారు. ఒకవేళ సామాజిక దూరం పాటించకపోతే..పరిస్థితి విషమిస్తుందన్నారు. దేశంలో ప్రతిరోజూ కరోనా వైరస్ కారణంగా మరణించేవారి సంఖ్య 6 వందలకు చేరుకోవచ్చని ఇటీవలే ఇరాన్ ఆరోగ్య శాఖ సహాయమంత్రి స్పష్టం చేసిన పరిస్థితి ఉంది.
దేశంలోని 43 కీలక కాలనీల్లో కరోనా వ్యాప్తి పీక్స్ లో ఉంది. రానున్న రోజుల్లో ఈ ప్రాంతాల్లో మరింత కఠిన చర్యలు తీసుకోవచ్చు. ఇరాన్ దేశంలోని 31 ప్రాంతాల్లో ప్రస్తుతం 21 ప్రాంతాలు కరోనా వైరస్ నేపధ్యంలో రెడ్ అలర్ట్ లో ఉన్నాయి. ఇరాన్ లో ఇప్పటికే స్కూల్స్, దుకాణాలు, రెస్టారెంట్లు, మసీదులు ఇతర కార్యాలయాలన్నీ రెండోసారి మూసివేయాల్సి వచ్చింది. పరిస్థితి రోజురోజుకూ విషమిస్తున్న నేపధ్యంలో నవంబర్ 20 వరకూ లాక్డౌన్ ( Lockdown in Iran ) పొడిగించారు. ఇరాన్ దేశపు టాస్క్ ఫోర్స్ కమిటీకు చెందిన ఓ అధికారి చెప్పినదాని ప్రకారం..దేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు కరోనా వైరస్ కారణంగా మరణిస్తున్నట్టు తెలుస్తోంది. Also read: Covid19 vaccine: ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ డిసెంబర్ నాటికి అందుబాటులో..
IRAN: విషమిస్తున్న పరిస్థితి..ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరి మరణం
ఇరాన్ లో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న కరోనా సెకండ్ వేవ్
ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరి మృతి
నవంబర్ 20 వరకూ ఇరాన్ లో లాక్డౌన్